Students Suicide | బాచుపల్లిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
విధాత, హైదరాబాద్ :
హైదరాబాద్ లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వేర్వేరు కళాశాలల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వీరు ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని కళాశాలలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమె సొంతూరు నారాయణ పేట జిల్లా మక్తల్ గ్రామం. విద్యార్థి ని ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక గాంధీ ఆస్పత్రికి తరలించారు.
ప్రగతినగర్‌లో మరో విద్యార్థి..
మరో ఘటనలో బాచుపల్లి పీఎస్ పరిధి ప్రగతి నగర్‌లోని ప్రగతి జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉరి వేసుకున్న అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. శవపరీక్షల కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram