Delhi CM:ఫ్లై ఓవర్‌పై కాన్వాయ్ ఆపి.. అధికారులను పరుగులు పెట్టించిన ఢిల్లీ సీఎం!

విధాత: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా క్రమంగా పాలనపై తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓ వైపు బలమైన ప్రతిపక్షం ఆమ్ ఆద్మీ పార్టీని ఎదుర్కోంటునే..ఇంకోవైపు పాలనను గాడిలో పెడుతున్నారు. తాజాగా హైదర్ పూర్ ఫ్లై ఓవర్ పై వెలుతున్న సీఎం రేఖా గుప్తా అన కాన్వాయ్ ను అకస్మాత్తుగా ఆపి అక్కడి అధికారులను పరుగులు పెట్టించారు.
సీఎం గారు.. ఎందుకు కాన్వాయ్ ఆపించారో అర్ధమయ్యే లోపునే రేఖా గుప్తా కారు దిగి ఫ్లై ఓవర్ పై తిరుగుతున్న ఆవుల వద్ధకు వెళ్లారు. ఎలాంటి ఆశ్రయం లేకుండా ఫ్లై ఓవర్ పై ప్రమాదకరంగా సంచరిస్తున్న ఆవులను తక్షణమే గో సంరక్షణ కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆలనా పాలన లేకుండా ఆవులు అలా రోడ్లపై సంచరించడం వాటితో పాటు వాహనదారులకు కూడా ప్రమాదమేనని రేఖా గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.