Ajit Pawar : అజిత్ పవార్ ఆఖరి పోస్టు వైరల్ !
చనిపోవడానికి నిమిషాల ముందే అజిత్ పవార్ ఆఖరి పోస్ట్! "మీ విశ్వసనీయ ప్రభుత్వం" అంటూ కీలక నిర్ణయాల వెల్లడి. కన్నీరుమున్నీరవుతున్న సోదరి సుప్రియా సూలే..
విధాత : విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సోషల్ మీడియా వేదికగా చివరిసారిగా చేసిన పోస్టు వైరల్ గా మారింది. ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ… మహారాష్ట్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న నిర్ణయాలను అజిత్ పవార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రమాదం జరగడానికి కొన్ని గంటల ముందు అజిత్ పవార్ పెట్టిన ఈ పోస్టు వైరల్ అవుతుంది.
త్వరలో ముంబయి, పుణె సహా పలు నగరాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అజిత్ పవార్ తన పోస్టులో వెల్లడించారు. మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో భాగంగా ‘మీ విశ్వసనీయ ప్రభుత్వం’ తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలు అని పేర్కొంటూ. .అజిత్ పవార్ చేసిన పోస్టులో..రాష్ట్రంలో వృత్తి శిక్షణా సంస్థలను ఏర్పాటుచేయడం, కాంట్రాక్టర్ల చెల్లింపు వ్యవస్థల్లో మార్పులు చేయడం, ప్రైవేటు కంపెనీలకు కేటాయించిన ప్రభుత్వ భూమి లీజు కాలాల పొడిగింపు వంటి విషయాలను వెల్లడించారు.
కడసారి సందర్శనకు తరలొచ్చిన బారామతి జనం
అజిత్ పవార్ తన రాజకీయ జీవితంలో 8 సార్లు బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఇదే ప్రాంతంలో విమాన ప్రమాదంలో ఆయన అకాల మరణం చెందడం నియోజకవర్గ ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. అజిత్ పవార్ ను కడసారి చూసేందుకు మృతదేహాన్ని తరలించిన ఆసుపత్రికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు.
సోదరుడు మరణం వేధిస్తుంది: ఎంపీ సుప్రియా సూలే
విమాన ప్రమాదంలో తన సోదరుడు, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణంచడన్న వార్తతో తాను తీవ్ర షాక్‌కు గురయ్యానని ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే పేర్కొన్నారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే అజిత్ సతీమణి సునేత్ర, కుమారుడు పార్థ్‌తో కలిసి మృతదేహాన్ని తరలించిన ఆసుపత్రికి సుప్రియా వెళ్లారు.
ఇవి కూడా చదవండి :
Ajit Dada : బారామతితో ప్రత్యేక అనుబంధం.. రాజకీయ ప్రస్థానం మొదలైన చోటే.. మట్టిలో కలిసిపోయిన అజిత్ దాదా
Ajit Pawar plane crash| విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram