Universal Kidney | శాస్త్రవేత్తల కీలక సృష్టి.. ఎవరికైనా సరిపోయే ‘యూనివర్సల్‌ కిడ్నీ’!

కిడ్నీ సమస్య ఉన్న రోగికి, సరిపోలే బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న కిడ్నీ దాత కోసం ఎదురు చూసే రోజులు ఇకపై ఉండవు. ఎలాంటి బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న వ్యక్తికైనా సరిపోయేలా (theoretically compatible with any blood type) యూనివర్సల్‌ కిడ్నీ(Universal Kidney)ని కెనడా(Canada), చైనా (China) శాస్త్రవేత్తలు (Researchers) అభివృద్ధి చేస్తున్నారు.

Universal Kidney | కిడ్నీ రీప్లేస్‌మెంట్‌ చేయాలంటే చాలా పెద్ద కథే ఉంటుంది. ముందు అవసరమైన బ్లడ్‌ గ్రూప్‌ ఉన్న దాత దొరకాలి. దానికి న్యాయపరమైన అవాంతరాలు దాటాలి. కానీ.. ఇప్పుడు జరుగుతున్న కృషి ఫలిస్తే.. ఈ వెతుకులాటలు ఏమీ ఉండవు. ఏ బ్లడ్‌ గ్రూప్‌ వ్యక్తులకైనా సరిపోయే కిడ్నీని రూపొందించే దిశగా శాస్త్రవేత్తలు గొప్ప ముందడుగు వేశారు. ఈ యూనివర్సల్‌ కిడ్నీని ‘టైప్‌ ఓ కిడ్నీ’గా పిలుస్తున్నారు. ప్రత్యేకమైన ఎంజైమ్స్‌ను ఉపయోగించడం ద్వారా యాంటిజెన్స్‌ను ఇది తొలగిస్తుంది. ఈ ఆవిష్కరణ అవయవాల మార్పిడిలో విప్లవాత్మకం కానుడటమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ దాతల కొరత సమస్యను అధిగమిస్తుంది.

ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ దిశగా మేజర్‌ బ్రేక్‌ థ్రూ సాధించేందుకు శాస్త్రవేత్తలు అడుగు దూరంలో నిలిచారు. ఈ యూనివర్సల్‌ కిడ్నీని డెవలప్‌ చేసే ప్రక్రియలో కెనడా, చైనా దేశాలకు సంబంధించిన పరిశోధకులు కలిసి పనిచేస్తున్నారు. ఎలాంటి బ్లడ్‌ గ్రూప్‌ రోగికైనా సరిపోయేలా దీనిని తయారు చేస్తున్నారు. ఒక బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి శరీరంలో టెస్ట్‌ ఆర్గాన్‌ను పరీక్షించగా.. తగిన విధంగా పనిచేసింది.

‘టైప్‌ ఏ కిడ్నీ’ని ‘టైప్‌ ఓ కిడ్నీ’గా కన్వర్ట్‌ చేయడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. కిడ్నీ రకాన్ని నిర్వచించే యాంటిజెన్స్‌ లేదా సుగర్‌ మాలిక్యూల్స్‌ను తొలగించేందుకు ఎంజైమ్స్‌ను ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు ఉపయోగించారు. ఇది అనుకున్న విధంగానే వివిధ రక్త గ్రూపుల ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను ప్రేరేపించే మార్కర్లను తొలగించింది. అయితే.. ఈ మార్పు పూర్తి స్థాయిలో స్థిరమైన ఫలితాలను అందించలేదు. టైప్‌ ఏ యాంటిజెన్‌ మూడోఒ రోజుకే తిరిగి కనిపించడం ప్రారంభించడంతో ఇది ఇమ్యూన్‌ రెస్పాన్స్‌ను ప్రేరేపించింది. ప్రతిచర్య తక్కువ తీవ్రతతో ఉండటంతో దానిని నియంత్రించారు. అదే సమయంలో కిడ్నీలను అడ్జెస్ట్‌ చేయడానికి శరీరం ప్రయత్నించిన సంకేతాలను కనుగొన్నారు.

సాధారణ పాఠకులు అర్థం చేసుకోవడానికి కిష్టంగా ఉన్న ఈ ప్రక్రియను కెనాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీకి చెందిన బయోకెమిస్ట్‌ స్టీఫెన్‌ విథెర్స్‌ సులభంగా వివరించారు. ‘ఒక కారుపై ఉన్న ఎర్రటి రంగును తొలగించి, తటస్థ ప్రైమర్‌ను వెలికి తీయడమే. ఒకసారి అది పూర్తి అయిన తర్వాత రోగ నిరోధక వ్యవస్థ ఇకపై ఆ అవయవాన్ని బయటిదిగా చూడదు’ అని ఆయన తెలిపారు. అయితే.. దీనిని తొలుత బ్రెయిన్‌ డెడ్‌ వ్యక్తి శరీరంలో అమర్చి ఫలితాన్ని సాధించినప్పటికీ.. హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించే ముందు అధిగమించాల్సిన సవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఈ అధ్యయనం నేచర్‌ బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌లో పబ్లిష్‌ అయింది.

మరిన్ని ఆసక్తికర వార్తలు
Silver Price | 10 నెలల్లోనే రెండింతలైన కిలో వెండి ధర: ఇన్వెస్టర్లకు లాభాల పంట
BJP Star Campaigner List | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ విడుదల