IRCTC Best Package: రూ. 11,170కే అరుణాచలం, పుదుచ్చేరి, కాంచీపురం

కేవలం రూ.11170కే నాలుగు రాత్రులు, ఐదు రోజులు సాగే ఈ యాత్రలో పుదుచ్చేరి(పాండిచేరి) లోని ప్యారడైస్ బీచ్, అరబిందో ఆశ్రమం, ఆరోవిల్లేతో పాటు కాంచీపురంలోని కామాక్షీ ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ యాత్ర నవంబర్ 21 న ప్రారంభం కానుంది. ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు ఉంటుంది.

భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో అరుణాచలం ఎంతో ప్రత్యేకమైనది. అరుణాచల శివయ్య దర్శనం జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాల్సిందేనని, పాప పరిహారంగా, కొరికలు నెరవేరాలంటే, విముక్తి పొందాలంటే ఆ శివయ్య గిరి ప్రదర్శన చేస్తే వస్తుందని భావిస్తారు. అంతటి మహత్యం ఉన్న శివయ్య దర్శనాన్ని చేసుకునేందుకు IRCTC మన ముందుకు ‘అరుణాచల మోక్షయాత్ర‘ పేరుతో ప్యాకేజీని తీసుకు వచ్చింది. కేవలం రూ.11170కే నాలుగు రాత్రులు, ఐదు రోజులు సాగే ఈ యాత్రలో పుదుచ్చేరి(పాండిచేరి) లోని ప్యారడైస్ బీచ్, అరబిందో ఆశ్రమం, ఆరోవిల్లేతో పాటు కాంచీపురంలోని కామాక్షీ ఆలయం, ఏకాంబరేశ్వర ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ యాత్ర నవంబర్ 21 న ప్రారంభం కానుంది. ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రైలు ఉంటుంది.

యాత్ర పూర్తి వివరాలు:

మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సాయంత్రం 5 గంటలకు ట్రైన్ నెంబర్: 17653 కాచిగూడ-పుదుచ్చేరి ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు. మరుసటి రోజు పుదుచ్చేరి స్టేషన్‌కు ఉదయం 11.05 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకువెళతారు. అక్కడ ఫ్రెష్ అయ్యాక యోగ సాధనకు, మానసిక ప్రశాంత, అటవీ అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఆరోవిల్లే, అరబిందో ఆశ్రమం చూస్తారు. ఆ తర్వాత ప్యారడైస్ బీచ్ చూసి రాత్రి పుదుచ్చేరిలోనే బస చేస్తారు. మూడవరోజు ఉదయం హోటల్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 120 కి.మీ దూరంలో ఉన్న తిరువన్నమళై కారులో తీసుకువెళ్తారు. అక్కడ హోటల్‌కు చేరుకున్నాక అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుంటారు. దర్శనానంతరం రాత్రి హోటల్‌లో బస చేసి నాలుగవ రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ముగించుకుని 120 కి.మీ దూరంలో ఉన్న కాంచీపురం బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక కామాక్షీ ఆలయం, ఏకాంబరేశ్వర్ టెంపుల్ సందర్శించుకుని అరక్కోణం చేరుకుంటారు. అరక్కోణం రైల్వేస్టేషన్‌లో ట్రైన్ నెంబర్:17651ను సాయంత్రం 6.05 గంటలకు ఎక్కి రాత్రంతా జర్నీ చేసి ఐదవ రోజు ఉదయం 7.50 గంటలకు కాచిగూడ చేరుకుంటారు.

టికెట్ ధరల వివరాలు:

ఈ ప్యాకేజీలో కంఫర్ట్, స్టాండర్ట్ అని రెండు రకాలు ఉంటాయి. కంఫర్ట్ ప్యాకేజీ ఎంచుకుంటే రైల్లో 3ఏసీ టికెట్, హోటల్‌లో ఏసీ గదులు ఉంటాయి. స్టాండర్డ్ అయితే రైల్లో స్లీపర్ టికెట్, హోటల్‌లో నాన్ ఏసీ గదులు ఉంటాయి. ఈ యాత్రకు ఒకరి నుంచి ముగ్గురు కలిసి వెళ్తే ఇద్దరు కలిసి ఒక గది తీసుకుంటే కంఫర్ట్ అయితే ఒక్కొక్కరికి రూ.19130, స్టాండర్డ్ అయితే 17060. అదే ముగ్గురు కలిసి ఒకే గది తీసుకున్నట్లైతే కంఫర్ట్‌లో ఒక్కొక్కరికి రూ.14740, స్టాండర్డ్ అయితే ఒక్కొక్కరికి రూ.12670 చొప్పున పడుతుంది. నలుగురు నుంచి ఆరుగురు కలిసి వెళ్తే ఇద్దరు కలిసి ఒక్కోగది తీసుకుంటే ఒక్కొక్కరికి కంఫర్ట్‌లో రూ.15460, స్టాండర్డ్ అయితే ఒక్కొక్కరికి రూ.13380 చొప్పున పడుతుంది. అదే ముగ్గురు కలిసి ఒక గది తీసుకున్నట్లైతే కంఫర్ట్‌లో ఒక్కొక్కరికి రూ. 13240, స్టాండర్డ్ అయితే ఒక్కొక్కరికి రూ. 11170 చొప్పున పడుతుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు అయితే విత్ బెడ్ కంఫర్ట్ రూ.10700, స్టాండర్డ్ రూ.8630. వితౌట్ బెడ్ అయితే కంఫర్ట్ రూ. 8060, స్టాండర్ట్ అయితే రూ. 5980 చొప్పున పడుతుంది.

నోట్: పూర్తి వివరాల కోసం వెబ్ సైట్‌ను సంప్రదించగలరు.

Also Read:IRCTC Best Package: కేరళ అందాలు చూసి వద్దామా,IRCTC Best Package: రూ. 5080కే గోదావరి అందాలు, పుణ్యక్షేత్రాలు చుట్టి రావచ్చు