గోవాలో నిర్మాత కె.పి చౌదరి ఆత్మహత్య

  • By: sr    news    Feb 03, 2025 3:31 PM IST
గోవాలో నిర్మాత కె.పి చౌదరి ఆత్మహత్య

టాలీవుడ్‌లో గ‌తంలో సంచ‌ల‌నం సృష్టించిన డ్రగ్స్ కేసులో గతంలో ప‌లుమార్లు ఆరోప‌ణ‌లు ఎదుర్కోవ‌డంతో పాటు అరెస్ట్ అయిన నిర్మాత‌ కేపీ చౌదరి ఆతంమ‌హ‌త్య చేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందారు.

గ‌తంలో రజినీకాంత్ కబాలీ సినిమాను తెలుగులో విడుదల చేసిన కేపీ చౌదరి పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఆ కేసుల అనంత‌రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడు.

ఈక్ర‌మంలోనే ఇవాళ ఉదయం గోవాలోని ఓ ఇంట్లో పోలీసులు వెళ్లి చూసే సరికి కేపీ చౌదరి విగతజీవిగా పడి ఉండడం గ‌మ‌నించారు.