Nagarjuna Sagar | విధాత : నాగార్జున సాగర్ ప్రాజెక్టు(Nagarjuna Sagar Project) క్రస్ట్ గేట్లు మరోసారి తెరుచుకున్నాయి. మొత్తం 26క్రస్టు గేట్లను ఎత్తి దిగువకు 2లక్షల 8,416క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణానదికి వస్తున్న వరదలతో ఎగువన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల(Srisailam Project) నుంచి భారీగా వరద నాగార్జున సాగర్ జలాశయానికి చేరుతుంది. దీంతో అధికారులు సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేపట్టారు. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి స్పీల్ వే మీదుగా పాలనురగలను తలపిస్తు దిగువకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ జల సోయగాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివెలుతున్నారు. జూలై 29న ఈ సీజన్ లో తొలిసారిగా గేట్లు ఎత్తిన అధికారులు ఇప్పటికే మూడు పర్యాయాలు గేట్లు ఎత్తడం విశేషం.
ప్రస్తుతం నాగార్జున సాగర్ నీటి మట్టం 589.20 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 590అడుగులు. ప్రస్తుత సామర్ధ్యం 309.95టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు. ఇన్ ఫ్లో 2,28,601క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,47,986క్యూసెక్కులుగా కొనసాగుతుంది. నాగార్జున సాగర్ గేట్ల నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో దిగువన పులిచింతల ప్రాజెక్టుల గేట్లను కూడా ఎత్తారు. దీంతో దిగువన ఏపీ పరిధిలోని ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పరవళ్లు సాగుతున్నాయి.
కాళేశ్వరం పంపులు కూడా ఆన్ చేసిన ప్రభుత్వం
కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Paroject) భాగమైన నంది, గాయత్రి పంప్‌హౌస్ మోటార్లను(Gayatri Pumphouse Motors) బుధవారం ఆన్ చేశారు. ఎల్లంపల్లి నుండి 9,450 క్యూసెక్కుల నీటిని 3 పంపుల ద్వారా నంది మేడారంకు, అక్కడి నుండి గాయత్రి పంప్‌హౌస్‌కు, అక్కడి నుండి మిడ్ మానేరు జలాశయానికి తరలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…