Pahalgam | పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిలా.. పూర్తిగా చిత్రీకరించిన తొలి వీడియో! NIA చేతిలో కీలక ఆధారం!

- నిందితుల గుర్తింపుకు కీలకం
- చెట్టుపై దాక్కుని వీడియో తీసిన స్థానిక వీడియోగ్రాఫర్
Pahalgam |
శ్రీనగర్ : పహల్గామ్ ఉగ్రదాడి కేసు విచారణను సవాలుగా స్వీకరించిన ఎన్ఐఏ.. దర్యాప్తులో కీలక ఆధారాలను సంపాదించింది. ఉగ్రదాడి ఘటనకు సంబంధించి చిత్రీకరించిన ఓ వీడియో ఎన్‌ఐఏ సేకరించింది. ఇది దర్యాప్తుకు కీలక సాధనంగా మారింది. బైసరన్‌కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియో గ్రాఫర్ ఉగ్రదాడి మొత్తాన్నీ కెమెరాలో బంధించాడు. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియో ఆధారంగా జరిగిన దారుణాన్ని ఓ వరుసక్రమంలో విశ్లేషిస్తూ దర్యాప్తును ఎన్‌ఐఏ ముందుకు దూకిస్తున్నది. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను, వారికి సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను వీడియో ఆధారంగా గుర్తించే పనిలో పడింది. జాతీయ దర్యాప్తు సంస్థ రీల్స్ వీడియోగ్రాఫర్ ను ప్రశ్నించి ఆధారాలు సేకరించింది.
రెండు గ్రూపులుగా ఉగ్రదాడి
ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ఆ వీడియో ద్వారా గుర్తించారు. తొలుత ఇద్దరు ఉగ్రవాదులు సందర్శకులను కల్మా చదవమన్నారు. ఆ తర్వాత నలుగురిని కాల్చి చంపారు. భయంతో సందర్శకులు తలోదిక్కుకు పారిపోయారు. ఇక జిప్‌లైన్ అనే ప్రదేశం నుంచి మరో ఇద్దరు ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు మొదలుపెట్టారు. రీల్స్ ఫొటోగ్రాఫర్ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి చెట్టు కొమ్మపై దాక్కొన్నాడు.
చెట్టుపైన దాక్కునే జరుతున్న దారుణాన్ని మొత్తం చిత్రీకరించాడు’’ అని ఓ సీనియర్ అధికారి వెల్లడించాడు. ఉగ్రవాదులు స్థానికుల నుంచి రెండు ఫోన్లు కూడా లాక్కొన్నట్లుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిల్లో ఒకటి సందర్శకుడిది కాగా.. రెండోది స్థానికులదని ఎన్ఐఏ గుర్తించింది. అయితే దాడి తర్వాతా స్విచాఫ్ వస్తున్నాయి. వాటిని ట్రాక్ చేస్తే ఉగ్రవాదులు ఎటుగా వెళ్లారన్న సమాచారం లభించవచ్చని ప్రయత్నిస్తున్నారు.
Pahalgam | పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందిలా.. పూర్తిగా చిత్రీకరించిన తొలి వీడియో! NIA చేతిలో కీలక ఆధారం!NIA చేతికి సంచలన వీడియో. దాడి జరుతున్న సమయంలో ఒక ఫోటో గ్రాఫర్ చెట్టుపై దాక్కుని వీడియో త్రీకరణ. NIA దర్యాప్తు ముమ్మరం. #PahalgamTerroristAttack pic.twitter.com/5yG8JzH5UF
— srk (@srk9484) April 27, 2025