• Telugu News
  • /News

OnePlus Nord 6 | 9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. పవర్‌బ్యాంక్‌లా వాడే టెక్నాలజీ కూడా!

One Plus Nord 6 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ భారత్‌‌లో తన నార్డ్ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో మిడ్ రేంజ్ ధరలో OnePlus Nord 6 మొబైల్‌ను విడుదల చేసింది.

Reported by: Chandram | వార్త‌లు | Apr 07, 2026, 10:33 pm IST
Read Time: 7 mins
OnePlus Nord 6 | 9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. పవర్‌బ్యాంక్‌లా వాడే టెక్నాలజీ కూడా!

OnePlus Nord 6 | ప్రతిసారి చార్జింగ్ పెట్టలేక విసిగిపోయిన వారికి శుభవార్త. ఇక రెండు మూడు రోజుల పాటు చార్జింగ్ పెట్టకపోయినా పనిచేసేలా అత్యంత శక్తివంతమైన బ్యాటరీతో మొబైల్ లాంచ్ అయ్యింది. 9000mAh సామర్థ్యం కలిగిన OnePlus Nord 6 మొబైల్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. బ్యాటరీతో పాటు ట్రిపుల్ చిప్‌సెట్స్ వంటి భారీ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ధర ఎంతంటే..!

గత మోడల్ నార్డ్ 5కి అప్‌డేటెడ్ వెర్షన్‌గా నార్డ్ 6 వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇది ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇందులో బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.38,999గా నిర్ణయించారు. ఇక 12జీబీ ర్యామ్+256జీబీ వేరియంట్ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.41,999గా ఉంది. ఏప్రిల్ 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ ఇండియాతో పాటు వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో వీటి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

3వేల దాకా డిస్కౌంట్

ప్రారంభ ఆఫర్ కింద యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఈఎంఐ లావాదేవీలపై రూ.3వేల వరకు డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. అలాగే ఈ ఫోన్‌పై No Cost EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

శక్తివంతమైన బ్యాటరీ.. రివర్స్ చార్జింగ్ ఫీచర్!

వన్‌ప్లస్ నార్డ్ 6 మొబైల్‌లో బ్యాటరీనే ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇది 9000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే రెండు రోజులకు పైగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. 80W సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో పాటు 27W రివర్స్ చార్జింగ్ సౌకర్యం కూడా ఇందులో ఉంది. ఈ ఫీచర్ ద్వారా నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించి ఇతర డివైజ్‌లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు.

డిస్‌ప్లే-పనితీరు

ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8S Gen4 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది 4nm టెక్నాలజీపై ఆధారపడి అత్యంత వేగవంతమైన పనితీరును అందిస్తుంది. 12జీబీ వరకు LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. దీనివల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. గేమింగ్ ఇష్టపడేవారినే దృష్టిలో ఉంచుకుని 165FPS వరకు ఇందులో గేమింగ్ సపోర్టు అందించారు.

డిస్‌ప్లే పరంగా 6.78 అంగుళాల 1.5K AMOLED స్క్రీన్‌తో ఈ ఫోన్ వస్తోంది. 165Hz రీఫ్రెష్ రేట్, 3600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్టు ఉంది. తక్కువ వెలుతురులో స్క్రీన్ చూసినా కళ్లకు ఇబ్బంది లేకుండా 3840Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీనిఈ మొబైల్‌లో అందించారు. Aqua Touch 2.0 ఫీచర్ వల్ల తడి చేతులతో కూడా స్క్రీన్‌ను సులభంగా ఆపరేట్ చేయవచ్చు.

కెమెరా ఆప్షన్స్

ఫొటోగ్రఫీ కోసం వన్‌ప్లస్ నార్డ్ 6 మొబైల్‌లో వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్ అందజేశారు. 50 మెగాపిక్సెల్ సోనీ LYTIA 600 మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఇందులో 4K వీడియో రికార్డింగ్ సపోర్టుతో పాటు AI ఆధారిత ఫొటో ఎడిటింగ్ టూల్స్ కూడా ఉన్నాయి.

ఇతర స్పెసిఫికేషన్లు

ఈ మొబైల్ IP66, IP68, IP69, IP69K రేటింగ్స్‌తో పాటు MIL STD 810H సర్టిఫికేట్‌తో వస్తుంది. దీంతో నీరు, ధూళి నుంచి రక్షణ లభిస్తుంది. ఇక క్రిస్టల్ గార్డ్ గ్లాస్ రక్షణతో స్క్రీన్ మరింత బలంగా ఉంటుంది.

ఈ మైబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16పై పనిచేస్తుంది. ఈ మొబైల్‌లో నాలుగు ప్రధాన ఓఎస్ అప్‌డేట్స్‌తో పాటు ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనున్నట్లు వన్‌ప్లస్ కంపెనీ వెల్లడించింది. Wifi 7, Bluetooth 6, 5G Advanced Support, NavIC, NFC, IR బ్లాస్టర్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

Read More:

20 వేలలోపే రెడ్‌‌మీ నోట్ 15 SE 5జీ.. స్లిమ్ డిజైన్, లైట్‌ వెయిట్‌తో స్పెషల్ ఎడిషన్!

వెట్ టచ్ సపోర్టుతో రెడ్‌మీ నుంచి సరికొత్త మొబైల్.. ధర, ఫీచర్లు ఏంటంటే..!