Hyderabad: నల్ల రిబ్బన్లతో ఒవైసీ.. ముస్లింల నమాజ్
విధాత: పహల్గావ్ ఉగ్రదాడిని నిరసిస్తూ..మృతులకు సంతాపం తెలియచేస్తూ ఎంఐఎం పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్ లో ముస్లింలు నల్ల రిబ్బన్ లు ధరించి నమాజ్ చేశారు. మక్కా మసీదులో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా ముస్లింలకు నల్ల రిబ్బన్లు పంపిణీ చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి అసదుద్దీన్ ఒవైసీ నమాజ్ చేశారు. ప్రార్థనల అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంత దూరం ర్యాలీ నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ నినదించారు. ముస్లింల ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram