డ్రోన్ల దెబ్బకు వణికిపోయిన లాహోర్, కరాచీ.. పరుగులు తీసిన పాక్ ప్రజలు
భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కరాచీ, లాహోర్‌లోని 12 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు చేసిందని పాక్ సైన్యం ప్రకటించింది. తొలుత డ్రోన్ దాడులు పాక్ ఆర్మీ రిహార్సల్స్‌గా ప్రచారం జరిగింది. డ్రోన్ దాడులతో కరాచీ, లాహోర్ పౌరులు భయంతో పరుగుతీశారు. కరాచీ, లాహోర్, సియాల్ కోట్ విమానాశ్రయాలను పాక్ అధికారులు మూసివేశారు.

Operation Sindoor : భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా కరాచీ, లాహోర్‌లోని 12 ప్రాంతాల్లో భారత్ డ్రోన్ దాడులు చేసిందని పాక్ సైన్యం ప్రకటించింది. తొలుత డ్రోన్ దాడులు పాక్ ఆర్మీ రిహార్సల్స్‌గా ప్రచారం జరిగింది. డ్రోన్ దాడులతో కరాచీ, లాహోర్ పౌరులు భయంతో పరుగుతీశారు. కరాచీ, లాహోర్, సియాల్ కోట్ విమానాశ్రయాలను పాక్ అధికారులు మూసివేశారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. లాహోర్‌లో మిలటరీ యూనిట్‌పై డ్రోన్ దాడిలో నలుగురు ఆర్మీ సిబ్బందికి గాయాలైనట్లుగా తెలుస్తున్నది. డ్రోన్ దాడులతో చైనా తయారీ హెచ్ క్యూ 9 డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది. అయితే పాకిస్తాన్‌లో డ్రోన్ దాడులపై భారత్ నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.
భారత్‌పై పాక్ మిస్సైల్ దాడులు
భారత్ పై పాకిస్తాన్ మిస్సైల్ దాడులకు దిగింది. వాటిని భారత్ ఆర్మీ గగనతలంలోనే కూల్చేసింది. జమ్ము, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా పాక్ మిస్సైల్ దాడులు సాగాయి. చైనాకు చెందిన హెచ్‌క్యూ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్థాన్.. భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తలా, జలంధర్, అదామ్‌పుర్, భఠిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ తదితర ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే.. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగించి, సమర్థంగా అడ్డుకున్నామని రక్షణశాఖ ప్రకటించింది. పాకిస్థాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాంతాల్లో ఉన్న గగనతల రక్షణ రాడార్‌లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని సైన్యం విరుచుకుపడింది. ఈ క్రమంలోనే లాహోర్‌లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసం అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెర్టార్లు, భారీ ఫిరంగులతో దాడులుచేస్తోంది. వీటిలో ఇప్పటివరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లోని 15 సైనిక పోస్టులపై పాక్ దాడులు జరిపింది. పంజాబ్ వ్యవసాయ భూముల్లో పాక్ బాంబుల శకలాలు పడిపోగా..దీనిపై ఎన్ఐఏ దర్యాప్తు జరుపుతుంది. భారత్ ఎస్ 400 డిఫెన్స్ సిస్టమ్ తో పాక్ మిస్సైల్స్ ను కూల్చింది. భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని పాక్‌కు భారత్ హెచ్చరికలు చేసింది.