Pranitha Subhash: ఇద్దరు పిల్లలున్నా.. పవన్ హీరోయిన్ ఎక్కడా తగ్గట్లేదుగా!

ప్రణీత సుభాష్ (Pranitha Subhash) తెలుగు వారికి ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం లేని నటి. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పాతికేళ్లు అవుతున్నాఇంకా ఎక్కడో ఓ చోట తన పేరు వినిపించేలా చేస్తోంది. తెలుగులో ఓ పది చిత్రాల వరకు చేసిన ఈ ముద్దుగుమ్మకు పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం విశేష గుర్తింపును తీసుకువచ్చింది.
ఇండస్ట్రీలోకి వచ్చి 2 పుష్కరాలు దాటినా అశించినంతగా అవకాశాలు అందుకోలేక స్టార్ స్టేటస్‌ను దక్కించుకోలేక పోయింది. కెరీర్‌లో కేవలం 30 చిత్రాలను మించి చేయలేక పోయింది.
అందం, అభినయం, గ్లామర్ విషయంలో ఎలాంటి ఢోకా పెట్టాల్సిన అవసరం లేని ఈ భామ హిందూ సాంప్రదాయాలను కడు పద్దతిగా ఆచరిస్తుంది.
అదేవిధంగా.. సోషల్ మీడియాలో, సామాజిక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రణీత ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంది. తన పౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవార్డులు సైతం దక్కించుకుంది. 2021లో బెంగళూరుకు చెందిన ఓ వ్యాపరవేత్తను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది.
అయినా ఇప్పటికీ ఫ్యాషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ నేటి యువ హీరోయున్లకు నేనేం తక్కువ కాదంటూ తన గ్లామర్ షోతో మతులు పొగొడుతుంది.
తాజాగా దుబాయ్‌లో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోకు అదిరిపోయే డ్రెస్సింగ్‌తో హజరై ఆహుతులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు,వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ కగా వాటిని చూసిన వారంతా ఏంటి ప్రణీత (Pranitha Subhash) ఇద్దరు పిల్లల తల్లేనా అంటూ అవాక్కవుతున్నారు.