Sai Pallavi: ద‌టీజ్‌.. సాయిప‌ల్ల‌వి

  • By: sr    news    Jan 05, 2025 8:49 PM IST
Sai Pallavi: ద‌టీజ్‌.. సాయిప‌ల్ల‌వి

ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌లో వరస అవకాశాలతో దూసుకుపోతోంది క‌థానాయిక‌ సాయి పల్లవి. అయితే గతంలో ఓ డిజాస్టర్ సినిమా కోసం సాయి పల్లవి చేసిన త్యాగం ఇప్పుడు నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సినిమాలు డిజాస్టర్ అయితే ఆ విషయం గురించి నటీనటులు పట్టించుకోరు.

ముఖ్యంగా హీరోయిన్లు అయితే సినిమా చేశామా, రెమ్యూనరేషన్ తీసుకున్నామా అన్నట్టుగా ఉంటారు. కానీ గతంలో శర్వానంద్ హీరోగా సాయి పల్లవి నటించిన ‘పడి పడి లేచే మనసు’ మూవీ కోసం తన రెమ్యునరేషన్‌లో కొంత భాగాన్ని వదులుకుందట. హను రాఘవపూడి దర్శకత్వం చేసిన ఈ చిత్రం 2018లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో నిర్మాతకు భారీ నష్టాలు తప్పలేదు.

దీంతో సాయి పల్లవి తన ఉదార స్వభావంతో నిర్మాత‌ల నుంచి త‌న‌కు రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ రూ. 40 లక్షలు తీసుకోకుండా మేక‌ర్స్‌కు అండగా నిలిచిందనే వార్త‌లు సోష‌ల్‌ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది.