Pregnant woman Weight Lifting | ఏడు నెలల గర్భిణి వెయిట్ లిఫ్టింగ్.. అమ్మ బాబోయ్ ఏకంగా 145 కిలోలే..!
కానీ, ఓ 7 నెలల గర్భిణి ఇవన్ని పక్కన పెట్టి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నది. అంతే కాదు ఏకంగా 145 కిలోల బరువును ఎత్తి అందరి మన్నలను అందుకుంది.
న్యూ ఢిల్లీ :
మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో సత్తా చాటుతున్న విషయం మనం సాధారణంగానే చూస్తున్నాం. సాధారణ ఉద్యోగి నుంచి విమాన పైలెట్ వరకు ప్రతి దాంట్లో మహిళలు దూసుకుపోతున్నారు. కానీ, వాళ్లకు అతి కష్టమైన సమయం గర్భిణిగా ఉండడం. అలాంటి సమయంలో సాధారణంగా మహిళలందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కనీసం చిన్న బరువులు కూడా ఎత్త కుండా జాగ్రత్త పడుతారు. కానీ, ఓ 7 నెలల గర్భిణి ఇవన్ని పక్కన పెట్టి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్నది. అంతే కాదు ఏకంగా 145 కిలోల బరువును ఎత్తి అందరి మన్నలను అందుకుంది.
మహిళ శక్తికి, వారి ధృఢ సంకల్పానికి నిలువేత్తు నిదర్శనంగా నిలిచింది ఢిల్లీకి చెందిన పోలీసు కానిస్టేబు సోనికా యాదవ్. ఏడు నెలల నిండు గర్భంతో ఉన్నప్పటికీ మహిళలకు ప్రేరణగా నిలుస్తూ మెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని కాంస్య పతకం గెలుచుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26 పోటీల్లో ఢిల్లీ పోలీస్ తరఫున సోనికా యాదవ్ (31) 84+ విభాగంలో బరిలోకి దిగారు. గర్భిణీ అయినా ఆమె సంకల్పం ముందు మిగతా విషయాలు పటా పంచలయ్యాయి.
అయితే, సోనికా స్టేజిపైకి రాగానే అక్కడున్నవారంతా సాధారణ క్రీడాకారిణిగానే భావించారు. కానీ, చివరి డెడ్ లిఫ్ట్ ప్రయత్నంలో.. ఆమె ఏడు నెలల నిండు గర్భిణి అని తెలిసినప్పుడు అక్కడున్నవారు ఆశ్చర్యానికి లోను కాగా ఒక్కసారిగా స్టేడియం మొత్తం నిశ్శబ్ధంగా మారింది. ఈ క్రమంలో సోనికా యాదవ్ పూర్తి ఏకాగ్రతతో 145 కిలోల బరువును అమాంతం ఎత్తి పట్టుకున్నారు. ఇది చూసిన ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్ల మోత మోగిస్తూ ఆమెను అభినందించారు. కాగా, 2023లో పవర్ లిఫ్టింగ్ ను ప్రారంభించిన సోనికా.. 2025 మే నెలలో గర్భవతి అని నిర్ధారణ అయింది. అయినా, సోనికా యాదవ్ తన ప్రాక్టీస్ ను మానివేస్తుందని ఆమె భర్తతో సహా.. కుటుంబ సభ్యులు భావించారు. కానీ, ఆమె క్రీడా ఆసక్తిని, ఫిట్ నెస్ పట్ల ఉన్న మక్కువను ఆమె వదులుకోలేకపోయింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram