Rawalpindi Chicken : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేడుకల్లో పాకిస్తాన్ నగరాల వంటకాలు!
భారత వాయుసేన 93వ వార్షికోత్సవ వేడుకల్లోని వంటకాల మెనూ వైరల్ అయింది. వైమానిక దాడులు జరిగిన పాకిస్తాన్ నగరాల పేర్లతో వంటకాలను ఏర్పాటు చేశారు.

న్యూఢిల్లీ : భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవ వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వేడుకల్లో ఏర్పాటు చేసిన వంటకాల మెనూ ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత వాయుసేన దాడులు నిర్వహించిన పాకిస్తాన్ లోని నగరాల పేర్లతో కూడిన పేర్లతో ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది. మెనూ ఫోటోను చూసిన వారు ఆశ్చర్యంతో కూడిన నవ్వులతో ఎంజాయ్ చేస్తున్నారు.
మెనూలో సున్నితమైన రాజకీయ వ్యాఖ్యానంతో రుచిని మిళితం చేసే అనేక రకాల వంటకాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మెనూలోని వంటకాలలో ‘రావల్పిండి చికెన్ టిక్కా మసాలా’, ‘రఫీకి రహరా మటన్’, ‘భోలారీ పనీర్ మేతి మలై’, ‘సుక్కుర్ షామ్ సవేరా కోఫ్తా’, ‘సర్గోధా దాల్ మఖానీ’, ‘జాకోబాబాద్ మేవా పులావ్’ , అలగే ‘బహవల్‌పూర్ నాన్’ ఉన్నాయి.
డెజర్ట్ కూడా వెనక్కి తగ్గలేదు. అతిథులకు ‘బాలాకోట్ తిరమీసు’, ‘ముజఫరాబాద్ కుల్ఫీ ఫలూదా, ‘మురిద్కే మీతా పాన్’ అందించారు. చిత్రంగా వాయసేన వేడుకల్లోని మెనూ వంటకాలలో పేర్లలోని పాకిస్తాన్ నగరాలన్ని కూడా 2019లో ఆపరేషన్ బందర్, తాజాగా జరిగిన ఆపరేషన్ సిందూర్ లో భారత వాయుసేన దాడులలో దెబ్బతిన్నవే కావడం గమనార్హం.