SS Thaman | తమన్.. నీ కష్టం పగొడికి కూడా రాకూడదయ్యా సామీ!

SS Thaman | టాలీవుడ్‌లో ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ తమన్ మ్యూజిక్ ప్రియులను తనదైన ముద్రతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. తమన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ళుగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్యకాలంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ మంచి హిట్ కావడమే కాకుండా మ్యూజిక్ పరంగా తమన్‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇంత పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు పరిస్థితులకు తలొంచక తప్పదేమో.. ఎప్పుడూ తనపని తను చేసుకుపోయే తమన్ ఈ […]

  • Publish Date - August 3, 2023 / 01:25 PM IST

SS Thaman |

టాలీవుడ్‌లో ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఎస్ తమన్ మ్యూజిక్ ప్రియులను తనదైన ముద్రతో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. తమన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ళుగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈమధ్యకాలంలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ మూవీ మంచి హిట్ కావడమే కాకుండా మ్యూజిక్ పరంగా తమన్‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఇంత పేరున్న మ్యూజిక్ డైరెక్టర్ కూడా అప్పుడప్పుడు పరిస్థితులకు తలొంచక తప్పదేమో.. ఎప్పుడూ తనపని తను చేసుకుపోయే తమన్ ఈ మధ్య కాలంలో నెట్టింట విపరీతంగా ట్రోలింగ్‌కి గురవుతున్నాడు. దీనంతకీ అతని నిర్ణయాలేనట కారణం. అదేంటని అనుకుంటున్నారా?

కెరియర్ పరంగా ఎన్నో మంచి సినిమాలకు మ్యూజిక్ అందించిన తమన్.. ఒకేసారి వచ్చిన ఆఫర్స్ అన్నింటినీ ఒప్పేసుకుని దేనికీ న్యాయం చేయలేక చిక్కుల్లో పడుతున్నాడు. అదే టైంలో ఈ విషయంగా ట్రోలింగ్ అవుతున్నాడు. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం నయం అనే సామెత ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్‌కి అస్సలు తెలీదు లాగుంది. లేదంటే ఇలాంటి పనులు చేయడు కదా..

మరీ అవకాశాలు వస్తున్నాయి కదా అని అందినకాడికి అన్నీ ఒప్పేసుకుని ఏ సినిమాకు సరైన న్యాయం చేయలేక తమన్ ఇలా అందరికీ దొరికిపోవడం.. హీరోల అభిమానుల వేపుడుకి హర్టయిపోవడం వంటివి ఎదుర్కొంటున్నాడు. తన దగ్గరకు వచ్చేవన్నీ భారీ సినిమా ఆఫర్సే.. ఏది కాదనలేక మొహమాట పడి ఇలాంటి ఇరకాటంలో పడుతున్నాడో ఏమో.. ఆయనకే తెలియాలి.

రీసెంట్ గా ‘బ్రో’ సినిమాకు సంగీతం కూడా తమనే అందించాడు. బోయపాటి-రామ్ సినిమాకు, శంకర్-చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’కు, త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ మూవీకి కూడా తమనే సంగీతాన్ని అందిస్తున్నాడు. మరింత పెద్ద సినిమాలకు సంగీతం అందించడం అంటే మాటలా..

కాబట్టి ఇస్తానన్న టైంకి ట్యూన్స్ అందించలేక,, దీనితో ఆ ఒత్తిడిని భరించలేక పోతున్నాడో ఏమో ఆ భారం అంతా ఇస్తున్న ట్యూన్స్ మీద పడి ఆగం ఆగం అవుతుంది. ఈ మధ్య విడుదలైన ‘బ్రో’ సినిమాలోని ‘జాణవులే’.. పాట సరిగా లేదని, చాలామంది అభిమానులకు ఈపాట నచ్చలేదనేలా కామెంట్స్ చేశారు.

టైంకి ట్యూన్స్ అందించడం లేదని చాలా ప్రాజెక్ట్స్ నుంచి తప్పిస్తున్నారో ఏమో.. చాలా సినిమాలకు ఇస్తానన్న టైంకి ట్యూన్స్ ఇవ్వలేకపోవడంతో రీరికార్డింగ్ లేట్ చేయడంతో ఆ ఎఫెక్ట్ మూవీ రిలీజ్ మీద పడి ఇబ్బంది పడుతున్నారు దర్శక నిర్మాతలు.

బోయపాటి, పోతినేని రామ్ కాంబినేషన్లో వస్తున్న ‘స్కంధ’ మూవీకి కూడా ఇలాగే ఓ పాట బ్యాలెన్స్ ఉంచేయడంతో ఆ సినిమా రిలీజ్ మరికాస్త లేట్ అయ్యేలా ఉందట. ఓపక్క రామ్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం లుక్ మార్చుకుని కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళీ స్కంధ కోసం రెడీ అవుతాడా అనేది తెలీదు.

అలాగే మహేష్ రాబోయే చిత్రం ‘గుంటూరు కారం’ మూవీకి తమన్ అందించిన మ్యూజిక్ కాస్త అసంతృప్తి గానే ఉంది. ఇప్పటికే తమన్ పనికి విసిగిపోయి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారనే టాక్ నడుస్తుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కానీ.. మరీ ఇలా అందలేనంత దూరాలు పరుగులు పెట్టి బోర్లా పడకూడదు. కావాలని చేజేతులా కెరియర్‌ని ఇబ్బందుల్లో పడేసుకుంటున్నాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్ అని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇకనైనా తమన్ కాస్త మేలుకుంటాడేమో చూడాలి.

Latest News