Site icon vidhaatha

TG EAPCET Result 2025: తెలంగాణ.. ఎప్‌సెట్ ఫలితాలు విడుదల

TG EAPCET Result 2025:

విధాత : తెలంగాణ ఎప్ సెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్-ఫార్మసీ ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఆదివారం 11గంటలకు ఎప్‌సెట్‌ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు సాధించిన ర్యాంకులు, మార్కుల జాబితాను అధికారులు వెల్లడించారు. విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ https://eapcet.tgche.ac.in/ చూడొచ్చు. ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు.

బాలికలదే ఆధిపత్యం
తెలంగాణ ఎస్ సెట్ ఫలితాల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీలలోనూ బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారు. ఇంజనీరింగ్ లో మొత్తం 2,07,190మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా..73.26శాతం..1,51,779మంది క్వాలిఫై అయ్యారు. అందులో బాలికలు 88,139మంది పరీక్షలు రాయగా..వారిలో 73.88శాతం..65,120మంది క్వాలిఫై అయ్యారు. బాలురు 1,19,051మంది పరీక్షలు రాయగా 72.79శాతం..86,659మంది క్వాలిఫై అయ్యారు.

అగ్రికల్చర్ ఫార్మసీలో మొత్తం 81,198మంది పరీక్షలకు హాజరుకాగా 87.82శాతం..71,309మంది క్వాలిఫై అయ్యారు. వారిలో బాలికలు 61,331మంది పరీక్షలు రాయగా 88.32శాతం..54,166మంది క్వాలిఫై అయ్యారు. బాలురు 19,867మంది పరీక్షలు రాయగా 86.29శాతం..17,143మంది క్వాలిఫై అయ్యారు.

తెలంగాణలో ఏప్రిల్‌ 29 నుంచి మే 4 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష పరీక్షలు నిర్వహించారు.

టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

ఇంజనీరింగ్ లో ఏపీకి చెందిన మన్యం పార్వతి పురం కొమరాడకు చెందిన పల్లా భరత్ చంద్ర(150.058429 మార్కులు) టాప్ 1ర్యాంకర్ గా నిలిచాడు. ఉదగండ్ల రామచరణ్ రెడ్డి టాప్ 2(148.284029), పమ్మిన హేమసాయి సూర్యకార్తిక్ టాప్ 3(147.085966), మెండె లక్ష్మిభార్గవ్ టాప్ 4(146.150845), మంత్రిరెడ్డి వెంకటగణేష్ రాయల్ టాప్ 5(144.053382), సుంకర సాయి రిషినాథ్ రెడ్డి టాప్ 6(143.723785), రష్మిత్ బండారి టాప్ 7(142.579622), బనిబ్రతా మజ్జి టాప్ 8(141.084897), కొత్త ధనుష్ టాప్ 9(140.24602), కొమ్మ శ్రీ కార్తిక్ టాప్ 10(138.257604) ర్యాంకులు సాధించారు.

అగ్రికల్చర్ ఫార్మసీలో మేడ్చల్ కు చెందిన పెద్దక్కగారి సాకేత్ రెడ్డి టాప్ 1(141.688297మార్కులు) ర్యాంకర్ గా నిలిచాడు. సబ్బాని లలిత్ వరెణ్య టాప్ 2(140.477712), చాడ అక్షిత్ టాప్ 3(140.00081), పెద్దింటి రాచాల సాయినాథ్ టాప్ 4(138.823946), రెడ్ల బ్రాహ్మణి టాప్ 5(138.71091), గుమ్మడిదల తేజస్ టాప్ 6(137.87924), కొలను అకిరానంద్ రెడ్డి టాప్ 7(137.635667), సాదు భానుప్రకాశ్ రెడ్డి టాప్ 8(136.702087), ఆర్జా సాముల్ సాత్విక్ టాప్ 9(136.674587), ఎదూళ్ల శేషకిరణ్ రెడ్డి టాప్ 10(136.494315) ర్యాంకు సాధించారు.

 

తెలంగాణలో ఏప్రిల్‌ 29 నుంచి మే 4 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశ పరీక్ష, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్ష పరీక్షలు నిర్వహించారు.

 

 

Exit mobile version