Hyderabad | ఇద్దరు రౌడీషీటర్లకు నగర బహిష్కరణ!

విధాత: హైదరాబాద్ నగరానికి చెందిన ఇద్ధరు రౌడీషీటర్లను పోలీస్ శాఖ నగర బహిష్కరణ చేసింది. నలపరాజు రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్, సురేందర్ అలియాస్ మీర్ పూట్ సూరిని నగర బహిష్కరణ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. రాజేష్ పై 19 కేసులు, 4 మర్డర్ కేసులు ఉన్నాయి. పలు మార్లు జైలుకు వెళ్లొచ్చిన తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ బెదిరింపులు, సుఫారీ దాడులు కొనసాగిస్తున్నాడు.
సురేందర్ పై వివిధ మర్డర్ కేసుతో పాటు తీవ్ర నేరాలకు సంబంధించి 21 కేసులున్నాయి. ఇతను కూడా పలు మార్లు జైలుకెళ్లి వచ్చినా నేరాలను కొనసాగిస్తున్నాడు. రాజేష్, సురేందర్ లను సెక్షన్ 261 సిటీ యాక్ట్ ప్రకారం నగర బహిష్కరణ చేస్తున్నట్లు సీపీ ప్రకటించారు. వారిద్ధరు హైదరాబాద్ పరిధిలో ఎక్కడ కనిపించినా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. అయితే హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైనప్పటికి వారిద్ధరు నేరాలు చేయడం ఆపుతారా అన్నది సందేహస్పదమే.