Anti-Terrorism Squad: పాక్ కు గూఢచర్యం.. మరో ఇద్దరు అరెస్ట్

Anti-Terrorism Squad: పాక్ కు గూఢచర్యం అరోపణలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరిని యూపీ యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు పాకిస్థాన్ కు చెందిన దౌత్య అధికారులతో సంబంధాలు పెట్టుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక మన దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని శత్రుదేశానికి చేర వేశారని పోలీసులు చెప్పారు.
ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేసే మొహద్ హరూన్ పాకిస్థాన్ దౌద్య అధికారి ముజమ్మల్ హుస్సేన్ తో టచ్ లో ఉన్నాడు. అంతేకా మన దేశంలో తీవ్రవాద వ్యాప్తి కోసం పనిచేస్తున్నాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేశారు. తుఫేల్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అతడు దేశ వ్యతిరేక వాట్సాప్ గ్రూప్లో చేరినట్లు గుర్తించారు. పాక్లో నిషేధానికి గురైన తెహ్రీక్ ఎ లబ్బేక్ సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా షాద్ రిజ్వీ వీడియోలను తరచూ షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాక మనదేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్ కు చేరవేస్తున్నట్టు పోలీసులు అనుమానించి తుఫేల్ ను అరెస్ట్ చేశారు.
జ్యోతి మల్హోత్రా ఉదంతం అనంతరం గూఢచర్యం ఆరోపణలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నిఘా సంస్థలు సీరియస్ గా తీసుకుంటున్నాయి. ఏ చిన్న అనుమానం కలిగినా వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నాయి.