Site icon vidhaatha

మంత్రి ఉత్తమ్ తో డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ భేటి

Uttam Kumar Reddy

విధాత, హైదరాబాద్ : డెన్మార్క్ రాయబారి రాస్మస్ క్రిస్టేన్సన్ శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. సందర్భంగా వాణిజ్య,పారిశ్రామిక రంగంలో రెండు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని మంత్రి ఉత్తమ్ ఆకాంక్షించారు. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న నగరాలలో హైదరాబాద్ ఒకటి అని.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణా రాష్ట్ర విశిష్టతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు వివరించారు.

ఐటీ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరంలో ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఆధునిక వసతులు,ఫార్మా రంగంలో పురోగతిని ఆయన వివరించారు. ఇప్పటికే తెలంగాణా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుండి పారిశ్రామిక వేత్తలు తరలి వస్తుంన్నారని డెన్మార్క్ లాంటి దేశం కుడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.

Exit mobile version