Air India Flight Accident : ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన భారీ ప్రమాదం
వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి పక్షి ఢీ కొట్టినా, పైలట్ అప్రమత్తంతో సేఫ్ ల్యాండింగ్.. 103 మంది ప్రయాణికులు సురక్షితం.

విధాత, హైదరాబాద్: ఎయిర్ ఇండియా విమానానికి భారీ ప్రమాదం తప్పింది. గురువారం మధ్యాహ్నం 2.38 గంటలకు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కొంత దూరం వెళ్లాక రెండో ఇంజిన్ ఫ్యాన్ రెక్కల్లో ఓ పక్షి ఇరుక్కుంది. దీంతో విమానం ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తయ్యాడు.
విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి తిరిగి వైజాగ్ ఎయిర్‌పోర్టులో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాల నేపథ్యంలో విమాన ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.