Project K విధాత: భారతీయ సినిమా రోజురోజుకూ తన ఖ్యాతిని పెంచుకుంటూ పోతోంది. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పటికే ప్రపంచ నలుదిశలా వ్యాపించింది. ఈ మధ్య కాలంలో విడుదలై, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ వరకు వెళ్లి గెలిచింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించి దుమ్ములేపారు. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ […]
Project K
విధాత: భారతీయ సినిమా రోజురోజుకూ తన ఖ్యాతిని పెంచుకుంటూ పోతోంది. అందులో ముఖ్యంగా తెలుగు సినిమా ఖ్యాతి ఇప్పటికే ప్రపంచ నలుదిశలా వ్యాపించింది. ఈ మధ్య కాలంలో విడుదలై, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ వరకు వెళ్లి గెలిచింది.
ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించి దుమ్ములేపారు. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ విభాగంలో ఆస్కార్ సొంతం చేసుకున్నతొలి భారతీయ గీతంగా కూడా చరిత్రను లిఖించింది.
ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ తనలోని నట విశ్వరూపం చూపించాడు. మొత్తం ఐదు భాషల్లో విడుదలైన ఈ సినిమాతో .. నేషనల్ వైడ్‌గా అల్లు అర్జున్‌కి అమోఘమైన క్రేజ్, ఫాలోయింగ్ వచ్చేసింది. అంతకు ముందు వరకు సౌత్‌లో మాత్రమే గుర్తింపు పొందిన అల్లు అర్జున్, ఈ సినిమాతో.. మొత్తం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఇందులో సీన్స్, డైలాగ్స్, మ్యానరిజం, పాటలు ఇలా అన్నీ పాపులర్ అయ్యాయి.. మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి కూడా. ఇదే ఊపుతో పుష్ప సినిమాకు సీక్వెల్ కూడా రాబోతుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా తెలుగు సినిమా మరో అద్భుతమైన చరిత్రను సొంతం చేసుకోబోతోంది. ప్రతి సంవత్సరం జూలై 19న అమెరికాలో జరిగే శాన్ డియాగో కామిక్ కాన్ వేడుకలో మన తెలుగు సినిమా కూడా ఉండబోతోంది. శాన్ డియాగో కామిక్ కాన్ ఇంటర్నేషనల్, 1970 నుండి శాన్ డియాగోలో ఏటా నిర్వహించ బడే మల్టీజోనర్ ఎంటర్టైన్మెంట్, దీనిలో కామిక్ పుస్తక అభిమానులు సృష్టికర్తలు, నిపుణులు, ఒకరినొకరు కలుసుకోవడానికి సమావేశమవుతారు.
Hello, America!