Sheep Scheme Scam | గొర్రెల స్కామ్ పై ఈడీ సోదాలు

తెలంగాణ గొర్రెల స్కామ్ కేసులో నేడు హైదరాబాద్‌లో ఈడీ అధికారులు 10చోట్ల సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఈ స్కామ్‌లో రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులపై కేసులు నమోదయ్యాయి.

Sheep Scheme Scam | గొర్రెల స్కామ్ పై ఈడీ సోదాలు

Sheep Scheme Scam | విధాత, హైదరాబాద్ : తెలంగాణలో వెలుగుచూసిన గొర్రెల స్కామ్ కేసులో ఈడీ బుధవారం హైదరాబాద్ లో 10చోట్ల సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో సబ్సిడీ గొర్రెల స్కామ్ కు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ కేసు నమోదైంది. గొర్రెల పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు చెందిన కీలక అధికారులను, ఉద్యోగులను 10మందిని అరెస్టు చేసి విచారణ చేపట్టింది. 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా రూ.4వేల కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేశారు. అయితే గొర్రెల కొనుగోలు పేరుతో దళారులు, అధికారులు కుమ్మక్కై నిధులు స్వాహా చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది.

గొర్రెల స్కామ్ ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ గొర్రెల స్కామ్ కేసులో విచారణ వేగవంతం చేసింది. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంటితో పాటు ప్రధాన నిందితులుమొయినుద్దీన్, ఈక్రముద్దీన్ ఇళ్లతో పాటు 10చోట్ల ఈడీ సోదాలు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.