ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణస్వీకారం

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మంత్రి మహ్మద్ అజారుద్దీన్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ లు సోమవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

విధాత, హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మంత్రి మహ్మద్ అజారుద్దీన్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ లు సోమవారం పదవి ప్రమాణ స్వీకారం చేశారు.  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు హాజరయ్యారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కేబినెట్ లో మంత్రిగా నియామితులైన అజారుద్ధీన్ 6నెలల వ్యవధిలో ..అంటే ఈ నెల 30వ తేదీలోగా ఎమ్మెల్యే  లేదా ఎమ్మెల్సీ గా ఎన్నిక కాని పక్షంలో పదవి కోల్పోయే గండం  ఎదుర్కోవాల్సి వచ్చేది.  గడువులోగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎంపికవ్వడంతో   అజార్ మంత్రి పదవిలో సురక్షితంగా  కొనసాగనున్నారు.

మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తా: అజారుద్దీన్‌

ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ అధిష్ఠానానికి, మంత్రి మండలికి, పీసీసీకి ధన్యవాదాలు తెలిపారు. మా సీఎం నా కెప్టెన్ అని…నేను ఇప్పుడు కెప్టెన్ కాదు అని..కెప్టెన్ గా ఉన్న సీఎం ఏది చెబితే అది చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని, వారి కోసం మరింత కృషి చేస్తానన్నారు. రాజకీయాల్లో, జీవితంలో ఎత్తుపల్లాలు వస్తుంటాయని, వాటన్నింటినీ అధిగమిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందని తెలిపారు. బ్లీహిల్స్‌లో ముస్లింల ఓట్ల కోసమే మంత్రి పదవి ఇచ్చారనేది వాస్తవం కాదు అని, సీఎం రేవంత్‌రెడ్డి మొదటి నుంచి కూడా మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారు అని గుర్తు చేశారు.

పదవులు అలంకారాలు కాదు: కోదండరాం

ప్రజల కోసం పని చేయడానికే పదవులు అని, అలంకారం కోసం ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు.
ఆదివాసీల భూ సమస్య, రిజర్వేషన్ల పెంపు, నిరుద్యోగ సమస్య, ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాలను ఎంచుకుని పని చేయడానికి ముందుకు సాగుతానన్నారు.

ఇవి కూడా చదవండి :

సైకిల్ ట్రాక్ పై మహిళకు వేధింపులు..హైదరాబాద్ లో ఘటన
రాజ్యసభలో 113 కు పెరిగిన బీజేపీ సంఖ్యా బలం

Latest News