₹10 వేలలోనే AI ఫోన్‌.. బడ్జెట్‌ మొబైల్స్‌లో కొత్త పోటీ

HMD Vibe2 5G భారత్‌లో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో కొత్త పోటీకి తెరలేపింది. Indus by Sarvam AI, Android 16, 6000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, 50MP AI కెమెరాతో ఈ ఫోన్‌ లాంచ్‌ ఆఫర్‌లో ₹9,499 ధరతో అందుబాటులోకి వచ్చింది.

HMD Vibe2 5G colour options with budget AI phone promotion

₹10 వేల లోపు ఆఫర్‌తో AI ఫోన్‌గా చర్చలోకి వచ్చిన HMD Vibe2 5G

 

AI అంటే ఇప్పటివరకు మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ప్రీమియం ఫోన్లు, ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, క్లౌడ్‌ టూల్స్‌. కానీ ఇప్పుడు ఆ కథ మారుతోంది. కృత్రిమ మేధస్సు సౌలభ్యాలు క్రమంగా సాధారణ వినియోగదారుల చేతిలో ఉన్న బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లలోకీ వస్తున్నాయి. అదే దిశగా HMD తన కొత్త వైబ్​2 5జి(Vibe2 5G)తో భారత మార్కెట్‌లో ఆసక్తికరమైన అడుగు వేసింది.

HMD Vibe2 5Gను కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో భారత ఏఐ కంపెనీ సర్వం భారతీయ భాషా ఉపకరణం ఇండస్​(Indus by Sarvam AI)ను  పొందుపరిచింది. భారతీయ భాషల్లో AI సేవలను అందించే దిశగా ఈ ఫోన్‌ను కంపెనీ ముందుకు తెచ్చింది. ఆండ్రాయిడ్​ 16, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ మే 26 నుంచి ఫ్లిప్​కార్ట్​లో అమ్మకానికి వచ్చింది.

బడ్జెట్‌ ఫోన్‌లో AI టచ్‌

హెచ్​ఎండీ వైబ్​2(HMD Vibe2 5G) అసలు ప్రత్యేకత కేవలం 5G కనెక్టివిటీ కాదు. దాని కృత్రిమ మేధ సౌకర్యం. ఈ ఫోన్‌లో Sarvam Indus app ముందుగానే ఇన్‌స్టాల్‌ అయి ఉంటుంది. దీంతో వినియోగదారులు 22 భారతీయ భాషల్లో AIతో మాట్లాడగలరని కంపెనీ చెబుతోంది. సర్వం AI ప్రకారం, ఈ ఇండస్​ యాప్​  Sarvam-105B ఏఐ మోడల్‌పై పనిచేస్తుంది. యాప్‌కు సంబంధించిన సమాచారమంతా భారత్‌లోనే నిల్వ చేస్తామని కూడా సంస్థ చెబుతోంది.

ఇది భారతీయ మార్కెట్‌కు ముఖ్యం. ఎందుకంటే మన దగ్గర స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల్లో అధిక శాతం ఇంగ్లీష్‌ కంటే తమ ప్రాంతీయ భాషలతోనే ఎక్కువ సౌకర్యంగా ఉంటారు. అలాంటి వారికి ఫోన్‌లో AI ఉన్నా, అది తెలుగులో, హిందీలో లేదా ఇతర భారతీయ భాషల్లో స్పందించలేకపోతే ఉపయోగం పరిమితమే. ఈ కోణంలో HMD Vibe2 5Gను “Made in India, Made for India” అవసరాలకు దగ్గరగా చూడొచ్చు.

ఫోన్‌ ధర కూడా దీనికి పెద్ద చర్చనీయాంశం. వైబ్​2లో 4GB ర్యామ్​ + 64GB స్టోరేజి వేరియంట్‌ ధర ₹10,999గా, 4GB RAM + 128GB వేరియంట్‌ ధర ₹14,999గా ఉంది. అయితే launch offerలో ఈ ఫోన్‌ ₹9,499 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.

ఆండ్రాయిడ్​ 16.. పెద్ద బ్యాటరీ

AI కెమెరా, 5G సపోర్ట్‌తో బడ్జెట్‌ సెగ్మెంట్‌లోకి వచ్చిన HMD Vibe2 5G

బడ్జెట్‌ ఫోన్‌ అయినప్పటికీ, వైబ్​2 5జీలో కొన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్​ 16ఓఎస్​, 50ఎంపీ ఏఐ డ్యూయల్​ వెనుక కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. అలాగే రెండు సంవత్సరాల పాటు భద్రతా అప్​డేట్లు కూడా ఇవ్వనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల హెచ్​డీ+ డిస్​ప్లే, 120Hz రిఫ్రెష్​ రేట్​, యునిసాక్​ టి8200 5జి ప్రాసెసర్​, 4జిబి LPDDR4x ర్యామ్​, 128GB వరకు స్టోరేజి ఉన్నాయి. 18W చార్జింగ్​ సపోర్ట్‌ ఉండగా, చార్జర్​ను కూడా ప్యాక్​లోనే ఇస్తున్నట్లు పేర్కొంది.

ఫోన్​ రంగులు కూడా కొంత విభిన్నంగా ఉన్నాయి. Cosmic Lavender, Nordic Blue, Peach Pink రంగుల్లో అందుబాటులో ఉంది. అంటే AI ఫీచర్‌ మాత్రమే కాకుండా, డిజైన్‌ పరంగా కూడా యువ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం కనిపిస్తోంది.

ఈ ఫోన్‌ వల్ల బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ఒక కొత్త ప్రశ్న మొదలైంది. ఇకపై 10 వేలలో ఫోన్‌ కొనేవారు కేవలం 5G, బ్యాటరీ, కెమెరా మాత్రమే చూడాలా? లేక AI assistant, భారతీయ భాషల సపోర్ట్‌, software updates కూడా కీలక ప్రమాణాలుగా మారతాయా? ఇప్పటివరకు AI అనే మాట ప్రీమియం ఫోన్లలోనే ఎక్కువగా కనిపించింది. కానీ HMD Vibe2 5G వంటి ఫోన్లు ఆ మాటను జనబాహుళ్యంలోకి తీసుకొస్తున్నాయి.

మొత్తంగా చూస్తే, HMD Vibe2 5G ఒక సాధారణ బడ్జెట్‌ 5G ఫోన్‌గా కాకుండా, AIని తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నంగా కనిపిస్తోంది. 22 భారతీయ భాషలతో AI support, పెద్ద బ్యాటరీ, తాజా Android, బడ్జెట్‌ ధర — ఇవన్నీ కలిపి చూస్తే, ₹10 వేల సెగ్మెంట్‌లో AI పోటీకి ఇది ఒక స్పష్టమైన సంకేతం. అయితే వేరియంట్లను బట్టి ధరలు కూడా మారతాయి సుమా!

Latest News