Honor Magic 9 | 8000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. భారీ అప్‌గ్రేడ్‌లతో రానున్న హానర్ మ్యాజిక్ 9 సిరీస్!
Honor Magic 9 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ నుంచి సరికొత్త మొబైల్ రానుంది. 8000mAh భారీ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో పాటు మెరుగైన కెమెరా టెక్నాలజీ, కొత్త తరహా వీడియో ఫీచర్లతో హానర్ మ్యాజిక్ 9 సీరిస్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం.
Honor Magic 9 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ నుంచి సరికొత్త మొబైల్ రానుంది. 8000mAh భారీ సామర్థ్యం కలిగిన బ్యాటరీతో పాటు మెరుగైన కెమెరా టెక్నాలజీ, కొత్త తరహా వీడియో ఫీచర్లతో హానర్ మ్యాజిక్ 9 సీరిస్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. చైనాకు చెందిన సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్ వైబోలో టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న హానర్ మ్యాజిక్ 8 స్మార్ట్‌ఫోన్‌లో 7000mAh బ్యాటరీ ఉండగా.. మ్యాజిక్ 8 ప్రో RSR మోడళ్లలో 7200mAh బ్యాటరీ అందించారు. ఈ క్రమంలో మ్యాజిక్ 9 సిరీస్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నట్లు సమాచారం. మూడు ప్రధాన మోడళ్లలో 8000mAh బ్యాటరీలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక డిస్‌ప్లే విషయంలో కూడా మ్యాజిక్ 9 సిరీస్ ఆకట్టు్కునే అవకాశం ఉందని తెలుస్తోంది. లీకుల ప్రకారం.. ఈ సిరీస్‌లోని అన్ని మోడళ్లు 1.5K రిజల్యూషన్‌తో కూడిన OLED డిస్‌ప్లేతో వస్తున్నట్లు సమాచారం. దీనివల్ల మెరుగైన విజువల్ ఎఫెక్ట్స్, స్పష్టమైన రంగులు, వీడియోల్లో మరింత క్వాలిటీ లభించే అవకాశం ఉంది.
కెమెరా ఫీచర్లలో కూడా హానర్ భారీ మార్పులే చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సిరీస్‌లో 200మెగాపిక్సెల్ మెయిన్ రియర్ కెమెరా సెన్సర్ ఉండొచ్చని టిప్‌స్టర్ తెలిపారు. అంతేకాకుండా మెరుగైన ఇమేజ్ స్టేబిలైజేషన్ టెక్నాలజీని జోడిస్తున్నట్లు సమాచారం. దీంతో తక్కువ వెలుతురులోనూ మెరుగైన ఫొటోలు, వీడియోలు రికార్డు చేయవచ్చు. సినిమా స్టైల్‌లో వీడియోలు తీసేందుకు ఇందులో ప్రముఖ సినిమా పరికరాల తయారీ సంస్థ ARRI స్ఫూర్తితో ప్రత్యేక వీడియో ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా, ఈ వివరాలపై హానర్ కంపెనీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. కానీ గతంలో మ్యాజిక్ 7, మ్యాజిక్ 8 సిరీస్‌లు అక్టోబర్ నెలలో విడుదలైన నేపథ్యంలో.. మ్యాజిక్ 9 సిరీస్ కూడా ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read More:
ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లతో.. త్వరలోనే మోటరోలా ఎడ్జ్ 70 సిరీస్ నుంచి మరో ఫోన్.
200మెగాపిక్సెల్ కెమెరాతో ఒప్పో రెనో 16 మొబైల్.. భారత్‌లో ఎప్పుడు విడుదలంటే..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram