కొలెస్ట్రాల్ నియంత్రణకు కొత్త మాత్ర ‘లిప్ ఫెండ్రా’

ప్రాణాంతక గుండె జబ్బులకు కారణమవుతున్న శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణకు మార్కెట్ లో త్వరలో కొత్త మాత్ర రాబోతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించే మాత్ర ‘లిప్‌ఫెండ్రా’కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది.

ప్రాణాంతక గుండె జబ్బులకు కారణమవుతున్న శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణకు మార్కెట్ లో త్వరలో కొత్త మాత్ర రాబోతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించే మాత్ర ‘లిప్‌ఫెండ్రా’కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఇలాంటి మందు ఖరీదైన ఇంజెక్షన్‌ రూపంలో లభించేది. ఇప్పుడు తొలిసారిగా మాత్ర రూపంలో రాబోతుంది.

కొలెస్ట్రాల్‌ను కట్టడిచేసి, గుండె జబ్బుల ముప్పును తగ్గించేందుకు సాధారణంగా స్టాటిన్లు అనే ఒకరకం ఔషధాలను ఇస్తుంటారు. ఇవి వాడినప్పటికీ కొందరిలో కొలెస్ట్రాల్‌ పరిమాణం తగ్గదు. ఇలాంటివారి కోసం మెర్క్‌ కంపెనీ ‘లిప్‌ఫెండ్రా’ మాత్రలను రూపొందించింది.

పీఎస్‌కే9 అనే కాలేయ ప్రొటీన్‌ను అడ్డుకోవడం ద్వారా పనిచేసే తొలి మాత్ర ఇదే. రక్తం నుంచి కొలెస్ట్రాల్‌ను తొలగించే శరీర సామర్థ్యాన్ని ఈ ప్రొటీన్‌ తగ్గిస్తుంది. దీన్ని లక్ష్యంగా చేసుకునే ఇంజెక్షన్లు దాదాపు దశాబ్దకాలంగా అందుబాటులో ఉన్నాప్పటికి వాటి ధరలు అధికంగా ఉండటం, ఆరోగ్యబీమా కంపెనీల ఆంక్షలు వంటివాటి వల్ల చాలా పరిమితంగానే వైద్యులు వీటిని సూచిస్తున్నారు.

ఇప్పుడు మాత్ర రూపంలో ‘లిప్‌ఫెండ్రా’ అందుబాటులోకి రానుండటంతో కొలెస్ట్రాల్ నియంత్రణలో కీలక పరిష్కార మార్గం లభించినట్లయ్యింది. ఎఫ్‌డీఏ అనుమతి రావడంతో ‘లిప్‌ఫెండ్రా’ మాత్రలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి.

Latest News