Oppo Find X9 Ultra | చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో మరో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మొబైల్ సిరీస్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. Oppo Find X9 Ultra, Oppo Find X9 S స్మార్ట్‌ఫోన్లను మే 21వ తేదీన అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ రెండు మొబైళ్లను కూడా ఇప్పటికే పలు దేశాల మార్కెట్‌లో ఒప్పో విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు భారత్‌లోకి తీసుకొస్తుంది.
Oppo Find X9 Ultra ఫీచర్లు
Oppo Find X9 Ultra మొబైల్ 6.82 అంగుళాల భారీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 1440*3168 పిక్సెల్ రిజల్యూషన్ కలదు. ప్రీమియం విజువల్ అనుభవం కోసం హై రీఫ్రెష్ రేట్, బ్రైట్ కలర్స్‌ను అందించే అవకాశం ఉంది. పర్పార్మెన్స్ కోసం ఇందులో 3nm ఆధారిత Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను అమర్చారు. ఈ ఫోన్‌లో గరిష్టంగా 16జీబీ ర్యామ్, 1టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్‌ను అందిస్తున్నారు.
ఇక ఇందులో 7050mAh భారీ బ్యాటరీని అందిస్తున్నారు. దీనివల్ల సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉంది. ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు కూడా ఉండనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 200 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అదనపు సెన్సర్ ఉండనున్నాయి. ముఖ్యంగా 10x ఆప్టికల్ జూమ్ సపోర్టింగ్ కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తున్నారు.
Oppo Find X9 S ఫీచర్లు
Oppo Find X9 S స్మార్ట్‌ఫోన్ కూడా శక్తివంతమైన ఫీచర్లతోనే వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. 7025mAh శక్తివంతమైన బ్యాటరీ ఇందులో ఉంది. ఇక ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇస్తున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఈ మొబైల్ లావెండర్ స్కై, మిడ్‌నైట్ గ్రే, సన్‌సెట్ ఆరెంజ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వస్తుంది.
ఈ రెండు ఫోన్లతో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌ను ఒప్పో కంపెనీ టార్గెట్ చేస్తోంది. ప్రస్తుం భారత మార్కెట్‌లో ఉన్న Samsung Galaxy Ultra సిరీస్, ఐఫోన్ ప్రో మోడల్స్, షావోమీ అల్ట్రా ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీని ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Read More:
తక్కువ ధరలోనే ప్రీమియం ఫోన్లు కావాలా.. బంపరాఫర్ ప్రకటించిన శాంసంగ్
