8000mAh టైటాన్ బ్యాటరీతో Realme 16T 5G.. లాంచ్ ఎప్పుడంటే..!
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme 16T 5G లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ Realme 16T 5G లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ 16 సిరీస్‌లో ఇది నాలుగో మోడల్‌గా రాబోతుంది. ప్రస్తుతం ఈ సిరీస్‌లో ఇప్పటికే Realme 16, Realme 16 Pro, Realme 16 Pro Plus అందుబాటులో ఉన్నాయి.
త్వరలోనే మార్కెట్‌లోకి రానున్న Realme 16T 5G స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీనే ప్రధాన హైలైట్‌గా చెప్పొచ్చు. ఇందులో 8000mAh సామర్థ్యం కలిగిన టైటాన్ బ్యాటరీని అందిస్తున్నారు. దీన్ని ఒక్కసారి ఫుల్‌గా చార్జ్ చేస్తే మూడు రోజుల పాటు వస్తుందని రియల్‌మీ కంపెనీ తెలిపింది అలాగే 14.3 గంటల గేమింగ్, 34 గంటల సోషల్‌మీడియా, 21.9 గంటల నావిగేషన్ సేవలను ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. ఇక ఈ బ్యాటరీ ఏడు సంవత్సరాల పాటు మెరుగ్గా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
ఈ మొబైల్‌లో 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో పాటు బైపాస్ చార్జింగ్, వైర్డ్ రివర్స్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనివల్ల గేమింగ్ సమయంలో వేడి తగ్గడమే కాకుండా ఇతర డివైస్‌లను కూడా చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
డిజైన్‌పరంగా చూస్తే ఈ ఫోన్ ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో రానుంది. వెనుక భాగంలో చతురస్రాకార కెమెరా మాడ్యుల్ ఉండగా.. అందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు LED ఫ్లాష్, సెల్ఫీ మిర్రర్‌ను ఏర్పాటు చేసింది. ఫోన్ కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉండనున్నాయి. ఈ డివైజ్ 8.8 మిల్లీమీటర్ల మందం ఉండనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ Starlight Black, Starlight Red, Blue కలర్ ఆప్షన్లలో లభించనుంది. మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో అమ్మకానికి రానుంది.
ఇక పనితీరు విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది. కనీసం 8జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానుందని సమాచారం. ఈ ఫోన్ ధర, కెమెరా, స్పెసిఫికేషన్లు ఇంకా బయటకు రాలేదు. వీటిని రియల్‌మీ కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.
Read More:
తక్కువ ధరలోనే ప్రీమియం ఫోన్లు కావాలా.. బంపరాఫర్ ప్రకటించిన శాంసంగ్
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భారీ ఆఫర్.. ఎన్నడూ లేనంత తక్కువ ధరకే శాంసంగ్ గెలక్సీ S25 అల్ట్రా!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram