Redmi A7 Pro | షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ బడ్జెట్ కేటగిరీలో Redmi A7 Pro స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసింది. కొద్దిరోజుల క్రితమే గ్లోబల్ మార్కెట్‌లోకి వచ్చిన ఫోన్.. సోమవారం నాడు భారత్‌లోకి విడుదలైంది. చవకైన ధరలోనే ఆకర్షణీయమైన ఫీచర్లు రావడంతో ఈ మొబైల్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ధర ఎంతంటే..
Redmi A7 Pro స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వస్తుంది. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,499గా నిర్ణయించారు. ఇక 4జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.12,499గా నిర్ణయించారు. ఈ మొబైల్ బ్లాక్(Black), మిస్ట్ బ్లూ(Mist Blue), పామ్ గ్రీన్(Palm Green), సన్‌సెట్ ఆరెంజ్(Sunset Orange) కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, షావోమీ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే Redmi A7 Pro స్మార్ట్‌ఫోన్ 6.9 అంగుళాల HD+IPS LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేటుతో పాటు 800 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్టు చేస్తుంది. డీసీ డిమ్మింగ్, టీయూవీ రైన్‌ల్యాండ్ ఐ కంఫర్ట్ సర్టిఫికేషన్ కలిగి ఉంది. ఇందులో వెట్ టచ్ సపోర్టు వంటి ఫీచర్ కూడా కలదు. అంటే తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా మెరుగ్గా పనిచేస్తుందన్నమాట.
ప్రాసెసర్
ఈ మొబైల్‌లో Unisoc T7250 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4GB LPDDR4X ర్యామ్‌తో పాటు గరిష్టంగా 128GB UFS 2.2స్టోరేజ్‌ను అందిస్తుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజ్‌ను పెంచుకునే అవకాశం కూడా ఉంది.ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS3పై పనిచేస్తుంది. దీనికి నాలుగేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తామని షావోమీ తెలిపింది.
కెమెరా సెటప్
ఈ మొబైల్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 32 మెగా పిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. దీనితోపాటు మరో సెన్సర్ కూడా ఉంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. అదనంగా గూగుల్ జెమిని, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
బ్యాటరీ
బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ బ్యాటరీ విషయంలోనూ షావోమీ జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో 6000mAh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చింది. ఇది 15W చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. అంతేకాకుండా 7W రివర్స్ వైర్ చార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. కనెక్టివిటీపరంగా ఇందులో డ్యూయల్ 4G VoLTE, Wifi, Bluetooth 54, GPS, NFC, USB Type C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది.
Read More:
