Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!

Tecno Pova 8 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Tecno Pova 8 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో భారత మార్కెట్‌లోకి మరో కొత్త మొబైల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. టెక్నో పోవా 8 స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 11వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికేక సోషల్‌మీడియాలో ఈ మొబైల్‌ టీజర్లను విడుదల చేయగా.. తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక పేజీ ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యక్షమైంది. దీంతో ఈ కొత్త సిరీస్‌పై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.

టెక్నో కంపెనీ విడుదల చేసిన టీజర్ ప్రకారం.. ఈ మొబైల్ 8000mAh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీతో వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న చాలా స్మార్ట్‌ఫోన్లలో 5000mAh నుంచి 6000mAh కెపాసిటీ కలిగిన బ్యాటరీలను వినియోగిస్తుండగా.. Pova 8 సిరీస్‌లో అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీలు ఇవ్వడం విశేషం. శక్తివంతమైన బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్‌మీడియాను వినియోగించేవారికి ఎది ప్రయోజనకరంగా మారనుంది.

డిజైన్‌పరంగా ఈ మొబైల్‌లో టెక్నో పోవా 7 సిరీస్‌లో కనిపించిన మాడ్యుల్ శైలినే కొనసాగించారు. కానీ ఇందులో కొత్తగా మ్యాట్రిక్స్ స్టైల్ డాటెడ్ లైటింగ్ ఎలిమెంట్‌ను జోడించినట్లు తెలుస్తోంది. ఇది నోటిఫికేషన్లు, కాల్స్, ఇతర సమాచారాన్ని స్క్రీన్ ఆన్ చేయకుండానే చూపించే ప్రత్యేక వ్యవస్థగా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ ఫీచర్ నథింగ్ ఫోన్లలో కనిపించే గ్లిఫ్ మ్యాట్రిక్స్ సిస్టమ్‌ను గుర్తుచేస్తోంది.

గీక్‌బెంచ్‌లో కనిపించిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 6జీబీ ర్యామ్‌తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని సమాచారం. ఇక ఈ మొబైల్ 45W ఫాస్ట్ చార్జింగ్ మద్దతు ఇస్తుందని అమెరికా ఎఫ్‌సీసీ ధృవీకరణ డేటాబేస్‌లో కనిపించినట్లుగా నివేదికలు వెల్లడించాయి. ఇక ఇందులో 5జీ నెట్‌వర్క్‌తో పాటు బ్లూటూత్, వైఫై, జీపీఎస్, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నట్లు సమాచారం.

Pova 7 మొబైల్స్ 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రావచ్చని లీకులు చెబుతున్నారు. అయితే వీటి ధర ఎంత ఉందనే వివరాలు మాత్రం ఇంకా టెక్నో కంపెనీ వెల్లడించలేదు.

 

Latest News