Vivo T5 | 7200mAh బ్యాటరీతో వివో T5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఫీచర్లు ఏంటంటే..!

Vivo T5 | మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మరో కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. Vivo T5 మోడల్‌ను ఆవిష్కరించింది.

Vivo T5 | మధ్యతరగతి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో మరో కొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. Vivo T5 మోడల్‌ను ఆవిష్కరించింది. Vivo T5 సిరీస్‌లో ఇప్పటికే Vivo T5 Pro 5G, Vivo T5x 5G మోడళ్లను అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టగా.. వాటికి తోడు ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసింది.

ధర ఎంతంటే..!

ప్రస్తుతం ఈ మొబైల్ ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. మెక్సికో మార్కెట్‌లో దీని ధరను 5799 మెక్సికన్ పెసోగా నిర్ణయించారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.32వేల వరకు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్2లో 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్లాక్, గోల్డెన్ కలర్ ఆప్షన్లలో దీన్ని విక్రయిస్తున్నారు.

డిస్‌ప్లే-పనితీరు

Vivo T5 మొబైల్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+LCD డిస్‌ప్లే అందించారు. ఇది 720*1570 పిక్సెల్ రిజల్యూషన్‌తోపాటు 120Hz రీఫ్రెష్‌రేట్‌ను సపోర్టు చేస్తుంద. ఇది గరిష్టంగా 1250 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. దీనివల్ల ఎండలోనూ స్క్రీన్‌ను స్పష్టంగా చూడవచ్చు.

ఇక పనితీరు విషయానికి వస్తే ఇది Qualcomm తయారుచేసిన Snapdragon 6s Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది 6nm టెక్నాలీ ఆధారంగా పనిచేస్తుంది. సాధారణ వినియోగంతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్ అవసరాలకు కూడా సరిపడేలా దీన్ని రూపొందించామని కంపెనీ చెబుతోంది. ఇందులో 8జీబీ LPDDR4x ర్యామ్, 256జీబీ UFS2.2 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తోంది.

కెమెరా స్పెసిఫికేషన్లు

ఫొటోగ్రఫీ కోసం ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. వెనుక భాగంలో LED ఫ్లాష్ కూడా ఉంది.

ఈ మొబైల్లో 7200mA భారీ బ్యాటరీనే ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. అలాగే ఇది IP68, IP69 రేటింగ్‌తో వస్తుండటంతో దుమ్ము, నీటి నిరోధకత కలిగి ఉంటుంది.

Read More:

VIVO T5 Pro | 9020mAh పవర్‌ఫుల్ బ్యాటరీతో వివో స్మార్ట్‌ఫోన్.. మిడ్ రేంజ్ మొబైల్స్‌లో సంచలనం!

Latest News