Xiaomi 18 Pro Max | స్మార్ట్‌ఫోన్లలో కెమెరా టెక్నాలజీ రోజురోజుకీ పెరిగిపోతున్న పోటీ నేపథ్యంలో షావోమీ భారీ మార్పులకు సిద్ధమైంది. తన Xiaomi 18 సిరీస్‌లోని ప్రో మ్యాక్స్ మోడల్‌లో రెండు 200 మెగాపిక్సెల్ కెమెరాలతో డ్యూయల్ సెటప్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు టెక్ ప్రపంచాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది.
చైనా టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇది హై క్వాలిటీ ఫొటోలను అందించగలదు. అది కాకుండా ఈ కెమెరా 22nm ప్రాసెస్‌పై రూపొందించడం వల్ల బ్యాటరీ వినియోగాన్ని తగ్గించి, వేడి ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అలాగే ఈ కెమెరా నెక్ట్స్ జనరేషన్ LOFIC HDR 3.0, హై ఫ్రేమ్ గెయిన్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లకు సపోర్టు ఇవ్వొచ్చని సమాచారం. దీంతో డైనమిక్ రేంజ్‌లో ఫొటోలు తీయవచ్చు. అలాగే తక్కువ కాంతిలో కూడా స్పష్టమైన ఫొటోలను తీసుకోవచ్చు.
ఇందులో మరో 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉండవచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. పెరిస్కోప్ లెన్స్‌తో వచ్చే ఈ కెమెరా మాక్రో ఫొటోగ్రఫీకి సపోర్టు చేస్తోంది. అలాగే పెద్ద అపర్చర్‌తో క్లియర్ జూమ్ షాట్స్ తీసుకోవచ్చు. అదనంగా జీపీ గ్లాస్ – ప్లాస్టిక్ లెన్స్, ఆప్టికల్ కోటింగ్ వంటి ఫీచర్లు కూడా ఈ డివైజ్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ మొత్తం సెటప్ కలిసి ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫొటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే వివో కంపెనీ నుంచి VIVO X300 Ultra మోడల్‌లో డ్యూయెల్ 200 మెగాపిక్సెల్ కెమెరాలను ప్రవేశపెట్టింది. అలాగే యాపిల్ కంపెనీ కూడా 200 మెగాపిక్సెల్ కెమెరా టెక్నాలజీపై పరీక్షలు నిర్వహిస్తున్నాయని సమాచారం. ఒప్పో కూడా తన Find X9 Ultra మోడల్‌లో భారీ సెన్సార్‌ను ఉపయోగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పెద్ద సెన్సార్‌లు ఎక్కువ కాంతిని గ్రహించడం వల్ల ఫొటోలు మరింత స్పష్టంగా, క్వాలిటీగా వచ్చే అవకాశం ఉంది. ఇలా అన్ని కంపెనీలు భారీ కెమెరాలపైన దృష్టి పెట్టిన నేపథ్యంలోనే షావోవీ కూడా 200మెగాపిక్సెల్ కెమెరాలపై దృష్టి పెట్టి ఈ మోడల్‌ను తీసుకొస్తు్నట్లు తెలుస్తోంది.
కెమెరా సెటప్‌లోనే కాకుండా Xiaomi 18 సిరీస్ మరింత శక్తివంతంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సిరీస్‌లోని ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌తో వస్తున్నాయి. ఇక ప్రో వేరియంట్లలో దీనికంటే అధునాతన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ఉండొచ్చని అంచనా. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీకుల ద్వారా వచ్చిన వివరాలే కావడంతో పూర్తి స్పెసిఫికేషన్లపై ఇంకా క్లారిటీ లేదు. ఈ సిరీస్‌ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేయనుంది. అప్పుడే కెమెరా సెటప్, స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read More:
గూగుల్ పిక్సెల్ కెమెరా డిజైన్‌తో టెక్నో స్పార్క్ 50.. రూ.17 వేలకే!!
7000mAh బ్యాటరీ, 200మెగాపిక్సెల్ కెమెరాతో వివో మొబైల్.. లాంచ్ ఎప్పుడంటే..!
