క్రికెట్ కు భారత్ లో ఉన్న ఆదరణ అంతా ఇంతకాదు..జాతీయ క్రీడ హాకీ అయినప్పటికి..క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్.. అభిమానులు పొందే మజానే వేరు. అందుకే భారత్ లో ఫైవ్ స్టార్ వ్యక్తి నుంచి పశువుల కాపరి వరకు క్రికెట్ ఆడటం..చూడటం కొనసాగుతుంది. గల్లీ గల్లీకి క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు ఈ దేశంలో సర్వ సాధారణం.
అయితే సాధారణంగా క్రికెట్ ఆడే దేశాల్లో ఒక్క జాతీయ జట్టును నాణ్యమైన ఆటగాళ్లతో తయారు చేయడం కష్టమవుతున్న తరుణంలో.. భారత్ లో మాత్రం టీమిండియా వంటి నైపుణ్యమున్న 10 జట్లను కూడా తయారు చేయవచ్చంటారు క్రీడా విశ్లేషకులు. గుర్తించబడిన క్రికెటర్ల కంటే గుర్తింపుకు నోచుకోని..అవకాశాలు దక్కని క్రికెటర్లే ఈ దేశంలో ఎక్కువగా ఉంటారనడంలో సందేహం లేదు.
తాజాగా ఎక్స్ లో పోస్టు చేయబడిన ఓ వీడియోలో ఓ యువ బౌలర్ గ్రామీణ ప్రాంతంలోని మట్టి పిచ్ పై తన అసాధారణమైన బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది. ఒక వికెట్ ను గురి చేసి బౌలింగ్ వేసి పడగట్టడంతో పాటు తను వేయాలనుకున్న చోట కచ్చితత్వంతో బంతులు వేస్తున్న వైనం విస్మయపరుస్తుంది. అతడు వికెట్ల ముందు ఉన్న కుండలు, టైర్లు, స్టంప్‌ల వంటి తాత్కాలిక లక్ష్యాలను కచ్చితమైన బంతులతో పదేపదే పడకొడుతూ, ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. యార్కర్లు, ఇన్ స్వింగర్లు వంటి అన్ని రకాల బంతులను సంధిస్తూ.. డైరెక్ట్ హిట్‌ల ద్వారా వికెట్లు పడగొట్టిన ఆ పిల్లాడి బౌలింగ్ ప్రదర్శన అతనిలోని సహజ క్రికెట్ ప్రతిభను హైలైట్ చేస్తుంది.
“బుల్ ఐ” అని పేరు పెట్టబడిన ఈ వీడియో క్లిప్ ను చూసిన నెటిజన్లు ఆ గ్రామీణ యువకుడి బౌలింగ్ ప్రతిభకు ఫిదా అయిపోతున్నారు. వెంటనే ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ వంటి ఐపీఎల్ జట్లు ఈ వీడియోను చూసి.. మట్టిలో మాణిక్యం వంటి అతడిని ట్రయల్ చేసి చూడాలని నెటిజన్లు కోరుతున్నారు.
కేవలం 19వేల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్న ఖాతాదారుడి పోస్టు చేసిన ఈ యువ బౌలర్ వీడియోకు 24గంటల్లోనే 73వేల మంది చూడటం..వందలకొద్ది లైక్ లు అందించడం విశేషం.
Bull eye 🔥 pic.twitter.com/xeJcDohFxA
— ராஜேஷ் (@r4jjesh) April 29, 2026
ఇవి కూడా చదవండి :
వీహెచ్..శివధర్ రెడ్డిలకు ప్రభుత్వ సలహదారు పదవులు !
‘కోహినూర్ వజ్రం’ను భారత్ కు ఇవ్వాల్సిందే: న్యూయార్క్ మేయర్
