Bumrah: టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..బుమ్రా వ‌చ్చేస్తున్నాడు..!

Bumrah: బుమ్ బుమ్…బుమ్రా.. ఈ పేరు చెబితే ఏ బ్యాట్స్‌మెన్ గుండెల్లో అయిన వ‌ణుకు పుట్టాల్సిందే. ప‌దునైన బంతులు విసురుతూ ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్స్‌ని వ‌ణికించే బుమ్రా దాదాపు 10 నెల‌ల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నారు. గాయం వ‌ల‌న టీమిండియా జ‌ట్టుకి దూర‌మైన బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఆయ‌న నెట్‌లో సాధన చేస్తున్న వీడియోను షేర్ చేయ‌గా, ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘టెల్ ద వరల్డ్.. ఐ యామ్ కమింగ్ హోమ్’ అనే పాట […]

  • By: sn    latest    Jul 19, 2023 9:20 AM IST
Bumrah: టీమిండియా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..బుమ్రా వ‌చ్చేస్తున్నాడు..!

Bumrah: బుమ్ బుమ్…బుమ్రా.. ఈ పేరు చెబితే ఏ బ్యాట్స్‌మెన్ గుండెల్లో అయిన వ‌ణుకు పుట్టాల్సిందే. ప‌దునైన బంతులు విసురుతూ ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్స్‌ని వ‌ణికించే బుమ్రా దాదాపు 10 నెల‌ల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నారు. గాయం వ‌ల‌న టీమిండియా జ‌ట్టుకి దూర‌మైన బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్న‌ట్టు తెలుస్తుంది. తాజాగా ఆయ‌న నెట్‌లో సాధన చేస్తున్న వీడియోను షేర్ చేయ‌గా, ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘టెల్ ద వరల్డ్.. ఐ యామ్ కమింగ్ హోమ్’ అనే పాట వినిపిస్తోంది. ఇక ఈ వీడియోకి ఇండియన్ క్రికెట్ టీమ్‌ను ట్యాగ్ చేస్తూ బుమ్రా ఈ వీడియో పోస్ట్ చేయడంతో ఆయ‌న రీఎంట్రీకి ఎంతో స‌మ‌యం లేద‌ని అభిమానులు భావిస్తున్నారు.

బుమ్రా చివరిగా గ‌త ఏడాది సెప్టెంబ‌ర్‌లో భార‌త్ త‌ర‌పున మ్యాచ్ ఆడాడు. ఆ స‌మ‌యంలో వెన్నునొప్పి త‌లెత్త‌డంతో దాదాపు 10 నెల‌ల పాటు క్రికెట్‌కి దూర‌మ‌య్యాడు. ఈ మ‌ధ్య‌లో జ‌రిగిన ఆసియా కప్, టీ-20 వరల్డ్ కప్, ఐపీఎల్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఇవేమి ఆడ‌లేదు. ఈ మ్యాచ్‌ల‌లో బుమ్రా లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపించింది. స‌ర్జరీ త‌ర్వాత బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం బౌలింగ్ బాగానే చేస్తుండ‌గా, ఆయ‌న ప్రాక్టీస్ సెషన్స్‌లో సుమారు 10 ఓవర్ల వరకు బౌలింగ్ చేస్తున్నాడని టాక్. ఇక రానున్న వరల్డ్ కప్ సమయానికి బుమ్రాని సిద్ధం చేయాలని బీసీసీఐ మెడికల్ సిబ్బంది భావిస్తున్నట్టు తెలుస్తుంది.

వ‌చ్చే నెల‌లో ఐర్లాండ్ టూర్ ఉండ‌గా, ఆ స‌మ‌యానికి బుమ్రా టీమిండియాతో క‌ల‌వ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఇక ఆ త‌ర్వాత ఆసియా క‌ప్, అక్టోబ‌ర్ 5 నుండి ప్రారంభం కానున్న వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో బుమ్రా పాలు పంచుకోనున్న‌ట్టు తెలుస్తుంది. బుమ్రా పోస్ట్‌ని బ‌ట్టి చూస్తుంటే ఆయ‌న పూర్తి ఫిట్ నెస్ సాధించిన‌ట్టు క‌నిపిస్తుంది. బుమ్రా ఎంట్రీపై బీసీసీఐ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. క‌నీసం వన్డే వరల్డ్ కప్ నాటికి బుమ్రా మునుపటి లయను అందుకుంటే మాత్రం టీమిండియాకి తిరుగు లేద‌నే చెప్పాలి. ఇప్పుడు భార‌త బౌలింగ్ లో సిరాజ్, ష‌మీ మాత్ర‌మే కాస్త ప‌టిష్టంగా క‌నిపిస్తున్నారు.