Rohit- Virat| వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యం త‌ర్వాత టీ20ల‌కి రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన రోహిత్‌, విరాట్

Rohit- Virat|  11 ఏళ్ల నిరీక్ష‌ణ‌.. గత 11 ఏళ్లలో భారత జట్టు ఏ ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేక‌పోయింది. 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ అందుకున్న భార‌త్ ఆ త‌ర్వాత ఎన్నో ఫైన‌ల్ మ్యాచ్‌లు ఆడిన ట్రోఫీని మాత్రం ముద్దాడ‌లేక‌పోయింది. ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అయిన త‌ప్ప‌క గెలిచి తీరాల‌ని భారతీయులు గ‌ట్టిగా కోరుకున్నారు. రోహిత్

  • Publish Date - June 30, 2024 / 06:48 AM IST

Rohit- Virat|  11 ఏళ్ల నిరీక్ష‌ణ‌.. గత 11 ఏళ్లలో భారత జట్టు ఏ ఐసీసీ ట్రోఫీని గెలుచుకోలేక‌పోయింది. 2013లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ అందుకున్న భార‌త్ ఆ త‌ర్వాత ఎన్నో ఫైన‌ల్ మ్యాచ్‌లు ఆడిన ట్రోఫీని మాత్రం ముద్దాడ‌లేక‌పోయింది. ఈ ఏడాది టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ అయిన త‌ప్ప‌క గెలిచి తీరాల‌ని భారతీయులు గ‌ట్టిగా కోరుకున్నారు. రోహిత్ బృందం స‌మిష్టి కృషితో అది నెర‌వేరింది.టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. రెండోసారి పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. 2007లో చివరిగా టీమిండియా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ధోని నాయ‌క‌త్వంలో అందుకున్న విష‌యం తెలిసిందే. అయితే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ విజ‌యం త‌ర్వాత ఇద్ద‌రు లెజండరీ ఆట‌గాళ్లు అంతర్జాతీయ టీ20కి వీడ్కోలు పలుకుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

భవిష్యత్తు తరాలకు అవకాశం ఇవ్వాలనే తాను అంతర్జాతీయ టీ20ల నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ స్ప‌ష్టం చేశాడు. ఫైన‌ల్ మ్యాచ్‌లో 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76 అసాధారణ బ్యాటింగ్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న అనంత‌రం విరాట్ త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. కీల‌క‌మైన మ్యాచ్‌లో జ‌ట్టుని గెలిపించే అవకాశాన్ని నాకు దేవుడు అందించాడు. ఇలాంటి అవ‌కాశం మ‌ళ్లీ రాదు. భారత్ తరఫున ఇదే నా చివరి టీ20 మ్యాచ్. ఒకవేళ ఈ ఫైన‌ల్లో ఓడినా నేను రిటైర్మెంట్ ప్రకటించేవాడిని. భవిష్యత్తు తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఐపీఎల్‌లో కుర్రాళ్లు అద్భుతాలు చేస్తున్నారు. వారు భార‌త జెండాని రెప‌రెప‌లాడించ‌గ‌ల‌రు అని కోహ్లీ తెలియ‌జేశాడు. కొన్ని మ్యాచ్‌ల్లో నేను విఫలమైన‌ప్ప‌టికీ దేవుడు దయ వల్ల కీలక మ్యాచ్‌లో రాణించగలగ‌డం సంతోషాన్ని ఇచ్చింద‌ని కోహ్లీ అన్నాడు.

ఇక కోహ్లీ బాట‌లోనే రోహిత్ కూడా టీ20ల‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తూ పెద్ద షాకే ఇచ్చాడు. టీ20 ఫార్మాట్‌లో నేను మంచి ఆట‌ని ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌కి వీడ్కోలు ప‌లికేందుకు ఇంత‌కు మించిన మంచి స‌మ‌యం కూడా ఇక రాదు. ఈ ఫార్మాట్‌తోనే నా అంత‌ర్జాతీయ కెరీర్ మొద‌లు అయింది. పొట్టి ప్ర‌పంచ క‌ప్ గెలిచాం ఇక నేను ఈ ఫార్మాట్‌కి గుడ్ బై చెబుతున్నాను అని రోహిత్ అన్నారు. ఈ ఫార్మాట్‌లో కొనసాగాలని రిపోర్టర్‌లు సూచించినా రోహిత్ శర్మ పట్టించుకోకుండా త‌న రిటైర్మెంట్‌పై ప్ర‌క‌ట‌న చేశాడు.

Latest News