ఆసియా కప్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ తీసుకున్నాడు

విధాత: ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ క్రికెట్ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ మొదలవ్వనుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ సారథి సల్మాన్ అఘా బ్యాటింగ్ తీసుకున్నాడు. వికెట్ స్లోగా ఉన్నందున సాధ్యమైనన్ని పరుగులు చేసి టీమిండియాను నిలువరించాలని భావిస్తున్నట్టు సల్మాన్ తెలిపాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. మొదట బౌలింగ్ చేయడం సంతోషకరమే అని చెప్పాడు. పిచ్ స్లోగా ఉన్నప్పటి తేమ ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నానని తెలిపాడు. పహల్గాం ఉగ్రదాడి..ఆపరేషన్ సింధూర్ లతో భారత్ పాకిస్తాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల అనంతరం జరుగుతున్న ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతుంది.