Vaibhav Suryavanshi : వామ్మో వైభవ్ సూర్యవంశీ..32బంతుల్లో సెంచరీ

వైభవ్ సూర్యవంశీ యూఏఈపై 32 బంతుల్లో సెంచరీతో దుమ్మురేపాడు. 16 బంతుల్లో ఫిఫ్టీ, మరో 16 బంతుల్లో శతకం పూర్తి చేసి ఇండియా-ఎ భారీ స్కోరు దిశగా నడిపించాడు

Vaibhav Suryavanshi : వామ్మో వైభవ్ సూర్యవంశీ..32బంతుల్లో సెంచరీ

విధాత : భారత క్రికెట్ లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా ఆసియా రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా ఇండియా -ఎతో యూఏఈ మ్యాచ్ లో వైభవ్ థన ధనాధన్ ఇన్నింగ్స్ తో టాప్ లేపాడు. వైభవ్ సూర్యవంశీ (102*; 32 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స్‌లు) చెలరేగి ఆడాడు. 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుర్రాడు.. మరో 16 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. 10 ఓవర్లకు ఇండియా-ఎ స్కోరు 149/1తో నిలిచింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-ఎ భారీ స్కోరు దిశగా సాగుతోంది. 12ఓవర్ల సమయంలో వైభవ్ ఏకంగా 42బంతుల్లో 15సిక్సర్లు, 11ఫోర్లతో 144పరుగులు సాధించి అవుటయ్యాడు. అతనికి జతగాకెప్టెన్ జితేష్ శర్మ క్రీజ్ లో ఉన్నాడు. 12ఓవర్ల సమయంలో భారత్ 195/3వికెట్లతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది.