elephants water play| ఏనుగుల జలకలాట..వైరల్ వీడియో చూసేయండి !
అటవీ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం..విహారం సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతులను అందిస్తుంటాయి. అందులోనూ నదిలో ఏనుగుల జంట జలకలాటలు చూడటం మరింత కనువిందుగా అనిపిస్తుంది. విరుంగా నేషనల్ పార్క్ ఉత్తర సెక్టార్‌లోని నది నీటిలో రెండు ఏనుగులు జల విన్యాసాలు చూసి తీరాల్సిందే.
విధాత : అటవీ ప్రాంతాల్లో ఏనుగుల సంచారం..విహారం సందర్శకులకు ఆహ్లాదకరమైన అనుభూతులను అందిస్తుంటాయి. అందులోనూ నదిలో ఏనుగుల జంట జలకలాటలు చూడటం మరింత కనువిందుగా అనిపిస్తుంది. విరుంగా నేషనల్ పార్క్ ఉత్తర సెక్టార్‌లోని నది నీటిలో ఆడుకుంటున్న రెండు ఏనుగులు కనిపించాయి. అరుదైన ఈ దృశ్యాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించడంతో అది మరింత కనువిందుగా కనిపించింది.
ఆఫ్రికాలోని కాంగో దేశంలో పురాతన జాతీయ ఉద్యానవనంగా..డీఆర్సీలోని యునేస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా విరుంగా నేషనల్ పార్కు గుర్తింపు పొందింది. ఈ నేషనల్ పార్కులో 400కు పైగా ఏనుగులు ఆవాసం పొందుతున్నాయి. వాటి సంరక్షణకు అటవీ శాఖ అనేక చర్యలు చేపట్టింది. ఈ పార్కులో పర్వత గొరిల్లాలు, చింపాంజీలు వంటి అరుదైన వన్యప్రాణులతో జీవ వైవిద్యానికి ఆలవాలంగా కొనసాగుతుంది.
దాదాపు 7,800కిలో మీటర్ల పరిధిలో ఉగండా, రువాండా దేశాల సరిహద్దుల వెంట విస్తరించిన విరుంగా నేషనల్ పార్కు వన్యప్రాణులు, అటవీ సంపద స్మగ్లర్ల సమస్యను ఎదుర్కోంటుంది. ఆ పార్కు పరిరక్షణ విధుల్లో ఇప్పటికే 240మంది ఫారెస్టు రెంజర్లు చనిపోవడం సమస్య తీవ్రతకు నిదర్శనం. అందుకే డ్రోన్ కెమెరాలతో సైతం విరుంగా పార్కులో పహారా కొనసాగిస్తున్నారు.
Two elephants were spotted playing in the water in the northern sector of Virunga National Park. This aerial footage offers a glimpse of their natural behavior and social bonds, highlighting the importance of protecting their habitat.
📷 Virunga National Park#Virunga #DRC… pic.twitter.com/FPWUM9TqdR
— Virunga National Park (@gorillacd) January 14, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram