India vs South Africa | టీ20 ప్రపంచకప్‌లో నేడు రసవత్తరమైన పోరు.. ఫైనల్‌ మ్యాచ్‌కు వానగడం..! రిజర్వ్‌డే ఉన్నా కూడా..!

India vs South Africa | దాదాపు నెల రోజులుగా క్రికెట్‌ ప్రియులను అలరించిన టీ20 వరల్డ్‌ కప్‌ తుది దశకు చేరింది. ఇవాళ బార్బడోస్ లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరుగబోతున్నది. రెండోసారి పొట్టి క్రికెట్‌ కప్‌ నెగ్గాలని ముద్దాడాలని టీమిండియా.. తొలిసారిగా ఐసీసీ వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ప్రొటీస్‌ జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. లీగ్‌ దశలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా ఫైనల్‌కు రెండు జట్లు చేరాయి.

  • Publish Date - June 29, 2024 / 08:41 AM IST

India vs South Africa | దాదాపు నెల రోజులుగా క్రికెట్‌ ప్రియులను అలరించిన టీ20 వరల్డ్‌ కప్‌ తుది దశకు చేరింది. ఇవాళ బార్బడోస్ లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌ వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరుగబోతున్నది. రెండోసారి పొట్టి క్రికెట్‌ కప్‌ నెగ్గాలని ముద్దాడాలని టీమిండియా.. తొలిసారిగా ఐసీసీ వరల్డ్‌ కప్‌ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని ప్రొటీస్‌ జట్లు కృతనిశ్చయంతో ఉన్నాయి. లీగ్‌ దశలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓటమి లేకుండా ఫైనల్‌కు రెండు జట్లు చేరాయి. మరికొద్ది గంటల్లో ఓవల్‌ మైదానం వేదికగా రసవత్తరమైన పోరు జరుగనున్నది. అయితే, ఈ మ్యాచ్‌కు వానముప్పు పొంచి ఉన్నది. ఆటకు వాన ఆటంకాలు కలిగించే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ నివేదికలు చెబుతున్నాయి. 99శాతం వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. మ్యాచ్‌ సమయంలో వాన కురిసే అవకాశం ఉందని ఆక్యూవెదర్‌ నివేదిక తెలిపింది.

ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు తేమశాతం సైతం అధికంగా ఉంటుందని చెప్పింది. అదేసమయంలో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వర్షంపడుతూ తగ్గుతూ.. ఉరుములు, పిడుగులు గాలితో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని వివరించింది. అయితే, నేడు జరిగే ఫైనల్‌ వాన కారణంగా రద్దయిన రిజర్వ్‌డే అందుబాటులో ఉంది. అయితే, ఆదివారం సైతం వానకురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రిపోర్టులు పేర్కొంటున్నాయి. రేపు సైతం మ్యాచ్‌ రద్దయితే.. పరిస్థితి ఏంటని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల్లో మ్యాచ్‌ తుడిచిపెట్టుకపోతే ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌-దక్షిణాఫ్రికా జట్లు సంయుక్త విజేతలుగా నిలువనున్నాయి.

చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు దక్షిణాఫ్రికా..

వెస్టిండిస్‌ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు ప్రత్యేకత ఉన్నది. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్‌కు చేరుకున్నది. తొలిసారిగా ఐసీసీ వరల్డ్‌ కప్‌లో ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారిగా. గతంలో ప్రొటీస్‌ జట్టు పలుసార్లు సెమిస్‌లోనే వెనుదిరిగింది. ఈసారి ఎలాగైనా కప్‌ను ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో ఉన్నది. ఇక రోహిత్‌ శర్మ నేతృత్వంలోనే టీమిండియా మరోసారి కప్‌ను నెగ్గాలని భావిస్తున్నారు. ఈ టోర్నీ అనంతరం టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి నుంచి రాహుల్‌ ద్రవిడ్‌ తప్పుకోనున్నారు. ఈ క్రమంలో కప్‌ను నెగ్గి ద్రవిడ్‌కు ఘనమైన వీడ్కోలు పలకాలని టీమిండియా భావిస్తున్నది. భారత జట్టు 2007లో నిర్వహించిన తొలి టీ20 వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ టీ20 టైటిల్ నెగ్గలేకపోయింది. ఈసారి మరోసారి కప్‌ను గెలవాలనే పట్టుదలతో ఉన్నది.

ఫైనల్‌కు అంపైర్స్‌ వీరే..

టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు మొదలవనున్నది. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఐసీసీ అంపైర్లను ప్రకటించింది. క్రిస్ గఫానీ, రిచర్డ్ ఇల్లింగ్ వర్త్ మైదానంలో అంపైర్లుగా వ్యవహరిస్తారని, థర్డ్ అంపైర్‌గా రిచర్డ్ కెటిల్ బరో, ఫోర్త్ అంపైర్‌గా రాడ్నీ టకర్ వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. కాగా, రిచర్డ్ కెటిల్ బరోను మైదానంలో కాకుండా మూడో అంపైర్‌గా నియమించడంపై టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిచర్డ్ కెటిల్ బరో మైదానంలో అంపై‌ర్‌గా ఉన్న సమయంలో పలు వివాదాస్పద నిర్ణయాలను వెల్లడించారు. పలు మేజర్ టోర్నమెంట్లలో భారత్ ఓటమికి కెటిల్ బరో పరోక్ష కారకుడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆయన మైదానంలో లేకపోవడం భారత జట్టుకు లాభించే అంశమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Latest News