IND Vs AUS T20 : రెండో టీ 20లో భారత్ ఓటమి

మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ20లో భారత్ 125 పరుగులకే ఆలౌట్ అవగా, ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

IND Vs AUS T20 : రెండో టీ 20లో భారత్ ఓటమి

విధాత : మెల్ బోర్న్ వేదికగా అస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో అస్ట్రేలియా 4వికెట్లతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా బ్యాటర్ల వైఫల్యంతో 18.4ఓవర్లలో 125పరుగులకే అలౌటై అసీస్ ముందు స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. అభిషేక్ శర్మ(68), హర్షిత్ రాణా(35) మినహా మిగతా బ్యాటర్లు అంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో భారత్ ఈ మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించలేకపోయింది. 126పరుగుల లక్ష్యచేధనను అసీస్ బ్యాటర్లు 13.2ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి సాధించడంతో భారత్ ఓటమి పాలైంది. 5 మ్యాచ్ ల టీ 20సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దు కాగా, రెండో టీ 20లో భారత్ ఓటమితో సిరీస్ అస్ట్రేలియా 1-0తో ముందడుగు వేసింది. తదుపరి టీ 20 మ్యాచ్ నవంబరు 2 (ఆదివారం)- బెలిరివ్‌ ఓవల్‌ మైదానంలో జరుగనుంది.

ఈ మ్యాచ్ లో అస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ మిచెల్ మార్ష్ 26బంతుల్లో 46 పరుగులు, (4సిక్స్ లు, 2ఫోర్లు), మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 15బంతుల్లో 28పరుగులు(1సిక్స్, 3ఫోర్లు)తో విజయానికి గట్టి పునాది వేశారు. జోష్ ఇంగ్లీస్ (20), టీమ్ డెవిడ్(1), మిచెల్ ఓవెన్(14), మాధ్యూ షార్ట్(0) పరుగులకు అవుటయ్యారు. స్టెయినిస్(6నాటౌట్), బార్ట్ లెట్(0 నాటౌట్)గా ఉన్నారు. భారత బౌలర్లతో బూమ్రా , వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు.

భారత బ్యాటర్లు టపాటపా

టాస్ గెలిచిన అసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఒపెనర్ గిల్( 5) , సంజు శాంసన్ (2) సూర్యకూమార్ యాదవ్(1) లు వరుసగా స్వల్ప స్కోర్లకే వెనుతిరిగారు. తిలక్ వర్మ భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో కీపర్ ఇంగ్లీస్ అద్బుత క్యాచ్ తో డకౌట్ అయ్యాడు. కాసేపటికే అక్షర పటేల్(7) రనౌట్ కాగా, శివమ్ దూబె(4) కూడా అవుటై నిరాశపరిచారు. ఈ పరిస్థితులో మరో ఓపెనర్ అభిషేక శర్మ మాత్రం తన దూకుడును కొనసాగిస్తూ 2సిక్స్ లు, 8ఫోర్లతో 68 పరుగులతో భారత్ గౌరవ ప్రద స్కోర్ చేసేలా ప్రయత్నించాడు. అతనికి బౌలర్ హర్షిత్ రాణా 1సిక్స్, 2ఫోర్లతో 35పరుగులు సాధించి మంచి సహకారం అందించాడు. కుల్ధీప్ యాదవ్(0), బూమ్రా రనౌట్(0) లు డకౌట్ కాగా, వరుణ్ చక్రవర్తి(0) నాటౌట్ గా నిలిచాడు.

అస్ట్రేలియా బౌలర్లలో హెజల్ వుడ్ 3 వికెట్లు, బార్టె లెట్, నాథన్ ఎల్లిస్ చెరో 2వికెట్లు, స్టైయినిస్ 1వికెట్ సాధించారు.