paris olympics 2024 |ఈ సారి రజతంతో సరిపెట్టుకున్న బల్లెం వీరుడు.. ప్రధాని మోదీ ప్రశంసలు
paris olympics 2024 | బల్లెం వీరుడు నీరజ్ చోప్రా 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. 2022లో ఈ టోర్నీలో రజత
paris olympics 2024 | బల్లెం వీరుడు నీరజ్ చోప్రా 2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. 2022లో ఈ టోర్నీలో రజత పతకాం దక్కించుకున్నాడు. ఇక 2022 డైమండ్ లీగ్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో ఛాంపియన్‌గా నిలవడంతో పాటు టోక్యో ఒలింపిక్స్ లో కూడా అతనికి గోల్డ్ మెడల్ దక్కింది. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్ కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ అందించాడు నీరజ్ చోప్రా . ఆగస్ట్ 7, 2021న టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకాన్ని అందించాడు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.

ఇక పారిస్ ఒలంపిక్స్‌లో రజతం సాధించాడు ఈ భారత స్టార్ అథ్లెట్ . వరుసగా రెండవ ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించి చరిత్ర సృష్టించడంతో నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తుంంది.. పారిస్ ఒలింపిక్స్ 2024లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో సీజన్ బెస్ట్ త్రో 89.45 మీటర్లు విసిరి సత్తా చాటాడు. కాగా అనూహ్య రీతిలో పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ ఈ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచి రికార్డు సృష్టించారు. ఒలింపిక్ రికార్డు 90.57 మీటర్లు కాగా 92.97 మీటర్ల దూరం విసిరి చరిత్ర తిరగరాశాడు. దీంతో నీరజ్ రజతంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రెండు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. క్వాలిఫయర్ రౌండ్‌లో 89.34 మీటర్ల త్రో విసిరి ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే ఫైనల్‌లో మొదటి ప్రయత్నంలో ఫౌల్ కావడం జరిగింది. వెంటనే పుంజుకొని బల్లేన్ని ఏకంగా 89.34 మీటర్ల దూర విసిరాడు. అయితే అంతకంటే ముందే పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ 92.97 మీటర్ల త్రో విసరగా, చోప్రా అతని కన్నా ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ క్రమంలో అతనికి రజతం దక్కింది. అయితే చోప్రా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడని, అతడొక అద్భుతమైన వ్యక్తి అంటూ మోదీ కొనియాడారు.. రజతం సాధించిన నీరజ్‌కి అభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్ తరాల అథ్లెట్‌లను నీరజ్ చోప్రా ప్రోత్సహిస్తూనే ఉంటాడంటూ ప్రధాని మోదీ కొనియాడారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram