RR vs PBKS| రాజ‌స్తాన్‌కి వ‌రుస ప‌రాజయాలు.. పంజాబ్‌ని విజ‌య‌తీరాల‌కి చేర్చిన సామ్ కరన్

RR vs PBKS| ఫ‌స్ట్ ఆఫ్‌లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన రాజ‌స్థాన్ రాయల్స్ చివ‌రికి వ‌చ్చే స‌రికి చెత్త‌గా ఆడుతూ అభిమానుల‌ని ఆందోళ‌నకి గురి చేస్తుంది. మొన్న‌టి వ‌ర‌

  • By: sn    sports    May 16, 2024 5:58 AM IST
RR vs PBKS| రాజ‌స్తాన్‌కి వ‌రుస ప‌రాజయాలు.. పంజాబ్‌ని విజ‌య‌తీరాల‌కి చేర్చిన సామ్ కరన్

RR vs PBKS| ఫ‌స్ట్ ఆఫ్‌లో మంచి ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చిన రాజ‌స్థాన్ రాయల్స్ చివ‌రికి వ‌చ్చే స‌రికి చెత్త‌గా ఆడుతూ అభిమానుల‌ని ఆందోళ‌నకి గురి చేస్తుంది. మొన్న‌టి వ‌ర‌కు టాప్ వ‌న్ లో ఉన్న ఈ జ‌ట్టు ఇప్పుడు మెల్లమెల్ల‌గా కింద‌కి జారుతుంది. ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ చేరుకున్న‌ప్ప‌టికీ రాజ‌స్థాన్ జ‌ట్టు వ‌రుస‌గా నాలుగు మ్యాచ్‌లు ఓడింది. గ‌త రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొద‌టి మ్యాచ్‌లో చిన్న టార్గెట్‌ని అందించింది. ఆ టార్గెట్‌ని ఆడుతూ పాడుతూ చేధించింది పంజాబ్. పంజాబ్ జ‌ట్టు అధికారికంగా ఈ టోర్నీ నుండి బ‌య‌ట‌కు పోయిన ఈ విజ‌యం మాత్రం వారికి కాస్త సంతృప్తిని ఇచ్చింది అని చెప్పాలి.

గౌహతి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయ‌ల్స్‌పై పంజాబ్ అయిదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్టు కోల్పోయి 144 ప‌రుగులు చేసింది. రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్స్‌లో రియాన్ పరాగ్ (48; 34 బంతుల్లో, 6×4), రవిచంద్రన్ అశ్విన్ (28; 19 బంతుల్లో, 3×4, 1×6) త‌ప్ప మిగ‌తా వారంద‌రు కూడా ఇలా వ‌చ్చి అలా పెవీలియ‌న్‌కి వెళ్లారు. ఎవ‌రు కూడా ప‌రాగ్‌కి స‌రైన స‌పోర్ట్ అందించ‌క‌పోవ‌డంతో త‌క్కువ స్కోరు సాధించింది. మ‌రోవైపు పంజాబ్ బౌల‌ర్స్ క‌ట్టుదిట్ట‌మైన బౌలింగ్ చేసి ఆక‌ట్టుకున్నారు. సామ్ కరన్ (2/24), రాహుల్ చాహర్ (2/26), హర్షల్ పటేల్ (2/28) రెండు వికెట్లు తీసారు.

ఇక ల‌క్ష్య చేధ‌న‌లో పంజాబ్ కింగ్స్ 18.5 ఓవర్లు ఆడి అయిదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బౌలింగ్‌లో చెల‌రేగిన సామ్ కరన్ (63*; 41 బంతుల్లో, 5×3, 3×6) బ్యాటింగ్‌లో కూడా అద్భుతుంగా ఆడాడు. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. పంజాబ్‌కి కూడా పెద్ద‌గా ఆరంభం ద‌క్క‌లేదు. ఆ జ‌ట్టు ఎనిమిది ఓవర్లలో 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల‌లో ప‌డింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (6; 4 బంతుల్లో, 1×4), రొసో (22; 13 బంతుల్లో, 5×4), శశాంక్ సింగ్ (డకౌట్, 2 బంతుల్లో), బెయిర్‌స్టో (14; 22 బంతుల్లో, 1×4) ఇలా ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జితేశ్ శర్మ (22; 20 బంతుల్లో, 2×6)తో కలిసి సామ్ కరన్ అయిదో వికెట్‌కు 46 బంతుల్లో 63 పరుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్ప‌డంతో ఆ జ‌ట్టు విజ‌య‌తీరాల‌కి చేరింది.