Site icon vidhaatha

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో సూపర్‌-8 పోరులో తలపడే జట్లు.. మ్యాచుల షెడ్యూల్‌ ఇదే..!

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశ ముగిసింది. నేపాల్‌పై బంగ్లా ఘన విజయం సాధించింది. దాంతో సూపర్‌8కు అర్హత సాధించిన జట్లు అధికారికంగా ఖరారైనట్లయ్యింది. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, అమెరికా, గ్రూప్‌-బీ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌.. గ్రూప్‌-సీ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌, వెస్టిండిస్‌, గ్రూప్‌-డీ నుంచి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ జట్లు సూప‌ర్‌-8కి అర్హత సాధించాయి. ఎనిమిది జట్లను సీడింగ్‌ ద్వారా రెండు గ్రూప్‌లుగా విభజించారు. జూన్ 19 నుంచి 25 వరకు సూప‌ర్-8 మ్యా‌చ్‌లు జరుగనున్నాయి. గ్రూప్‌-1లో భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్‌-2లో దక్షిణాఫ్రికా, వెస్టిండిస్‌, అమెరికా, ఇంగ్లండ్‌ జట్లు ఉన్నాయి. సూపర్‌-8లో టీమిండియా మూడు మ్యాచులు ఆడనున్నది. ఈ నెల 20న కరేబియన్‌ దీవుల్లోని బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో తొలి మ్యాచ్‌ ఆడనున్నది. 22న ఆంటిగ్వాలో బంగ్లాదేశ్‌, 24న సెయింట్‌ లూసియాలో ఆస్ట్రేలియాతో తలపడనున్నది. భారత జట్టు ఆడే మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8 గంటలకు మొదలవనున్నాయి.

సూపర్-8 పూర్తి షెడ్యూల్ ఇలా..

19న అమెరికా-ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌ ఆంటిగ్వాలో రాత్రి 8 గంటలకు జరుగుతుంది.
20న 20 ఇంగ్లండ్ – వెస్టిండీస్ మ్యాచ్‌ లూసియాలో ఉదయం 6 గంటలకు ఉంటుంది.
20న భారత్ – ఆఫ్గనిస్థాన్ మ్యాచ్‌ బార్బడోస్ వేదికగా రాత్రి 8 గంటలకు మొదలవుతుంది.
21న ఆస్ట్రేలియా – బంగ్లాదేశ్ మ్యాచ్‌ బార్బడోస్‌లో ఉదయం 6 గంటలకు ఉంటుంది.
21న ఇంగ్లండ్ – ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌ లూసియాలో రాత్రి 8 గంటలకు ఉంటుంది.
22న అమెరికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్‌ బార్బడోస్‌లో ఉదయం 6 గంటలకు జరుగుతుంది.
22న భారత్ – బంగ్లాదేశ్ మ్యాచ్‌ ఆంటిగ్వాలో రాత్రి 8 గంటలకు ఉంటుంది.
23న ఆఫ్గనిస్థాన్ – ఆస్ట్రేలియా విన్సెంట్‌లో ఉదయం 6 గంటలకు మొదలవుతుంది.
23న అమెరికా – ఇంగ్లండ్ మ్యాచ్ బార్బడోస్‌లో రాత్రి 8 గంటలకు ఉంటుంది.
24న వెస్టిండీస్ – ద‌క్షిణాఫ్రికా మ్యాచ్‌ ఆంటిగ్వాలో రాత్రి 6 గంటలకు జరుగుతుంది.
24న భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్‌ లూసియాలో రాత్రి 8 గంటలకు మొదలవుతుంది.
25న ఆఫ్గనిస్థాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్‌ విన్సెంట్‌లో ఉదయం 6 గంటలకు జరుగుతుంది.

Exit mobile version