Site icon vidhaatha

T20 World Cup | టీ20 వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌ బౌలర్‌ సంచలనం.. వేసిన నాలుగు ఓవర్లు మెడిన్‌..!

T20 World Cup | ప్రపంచ క్రికెట్‌లో సంచలనం రికార్డయ్యింది. టీ20 వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌ బౌలర్‌ లూకీ ఫెర్గూసన్‌ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఈ బౌలర్‌ విసిరిన నాలుగు ఓవర్లకు నాలుగు ఓవర్లు మెడిన్‌గా వేశాడు. అంతే కాకుండా మూడు వికెట్ల సైతం పడగొట్టాడు. అంతర్జాతీయ టీ20లో ఇవే అత్యుత్తమ గణాంకాలుగా నిలిచాయి. అలాగే, టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో నాలుగు ఓవర్లు మెడిన్‌గా వేసిన తొలి బౌలర్‌గా ఫెర్గూసన్‌ ఘనత సాధించాడు. టీ20 వరల్డ్‌ కప్‌లో భాగంగా పాపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ బౌలర్‌ ఈ సరికొత్త రికార్డును లిఖించాడు. ఇంతకు ముందు కెనడా బౌలర్‌ సాజిద్‌ బిన్‌ జాఫర్‌ నాలుగు ఓవర్లను మెడిన్‌గా వేసి రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇదిలా ఉండగా.. టీ20 వరల్డ్‌ కప్‌లో పాపువా న్యూ గినియాతో జరిగిన ఈ మ్యాచులో న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన గినియా జట్టును ఫెర్గూస‌న్ కుప్పకూల్చాడు. ఫలితంగా ఆ జట్టు 78 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ మూడు వికెట్లను కోల్పోయం లక్ష్యాన్ని చేరింది. న్యూజిలాండ్‌, గినియా జట్లు ఇప్పటికే టీ20 వలర్డ్‌ కప్‌ నుంచి నిష్క్రమించాయి. చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గ్రూప్‌-సీలో న్యూజిలాండ్ మూడోస్థానానికి చేరింది. అయితే, కివిస్‌ జట్టు టీ20 వరల్డ్‌ కప్‌లో నాకౌట్‌ దశకు చేరకుండా వెనుదిరగడం క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఇటీవల కాలంలో ఆ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేస్తుండగా.. పొట్టి ప్రపంచకప్‌లో మాత్రం నిరాశపరిచింది.

Exit mobile version