Site icon vidhaatha

పాపం.. ఆర్సీబీకి ఈ సీజ‌న్ కూడా క‌లిసి రావడం లేదుగా.. కోహ్లీ సెంచ‌రీ చేసిన ఓట‌మి త‌ప్ప‌లేదు..!

Kohl

గ‌త 16 సంవ‌త్స‌రాలుగా అద్భుత‌మైన టీమ్‌తో ఐపీఎల్ ఆడుతున్న ఆర్సీబీ ఒక్క‌సారి కూడా టైటిల్ ద‌క్కించుకోలేక‌పోయింది. ఈ సారైన ఏమైన అద్భుతాలు చేస్తుందా అంటే అది క‌ష్ట‌మ‌నే అనిపిస్తుంది. ప్ర‌స్తుతం జ‌ట్టులో ఒక్క కోహ్లీ త‌ప్ప మిగ‌తా బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రు కూడా పెద్దగా రాణించ‌డం లేదు. తాజాగా ఆర్ఆర్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కోహ్లీ శ‌తకం బాదాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఇది మొదటి సెంచరీ కాగా, ఐపీఎల్‌లో విరాట్ కోహ్లికి ఇది 8వ సెంచరీ. తద్వారా ఐపీఎల్‌లో ఎక్కువ సెంచరీలు చేసిన వారి జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ త‌ర్వాత రెండో స్థానంలో ఉన్న క్రిస్ గేల్ 6 సెంచరీల‌తో ఉన్నాడు.ఇక విరాట్ కోహ్లీకి రాజస్థాన్ రాయల్స్‌పై ఇది మొదటి సెంచరీ.

ఆర్ఆర్‌తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి విరాట్ కోహ్లీ తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్ద‌రి త‌ర్వాత ఏ బ్యాట్స్‌మెన్ కూడా పెద్ద‌గా స్కోరు చేయ‌లేక‌పోయారు. మొత్తానికి టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ జట్టుకు 184 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే అంత పెద్ద టార్గెట్‌ని కూడా ఆర్సీబీ కాపాడుకోలేక‌పోవ‌డం విశేషం. బ‌ట్ల‌ర్ ఈ మ్యాచ్‌లో విజృంభించ‌డంతో ఆర్ఆర్ సునాయాసంగా విజ‌యం ద‌క్కించుకుంది.ఖాతా తెరవకముందే యశస్వీ జైస్వాల్‌ను టోప్లే పెవిలియన్‌కు పంపిన‌ప్ప‌టికీ బ‌ట్ల‌ర్, సంజూశాంస‌న్ మాత్రం మ‌రో వికెట్ ప‌డ‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా ఆడారు.

58 బంతుల్లో బ‌ట్ల‌ర్ 100 ప‌రుగులు చేయ‌గా, సంజూ శాంస‌న్ 42 బంతుల్లో 69 ప‌రుగులు చేశాడు. మొద‌ట్లో చాలా త‌క్కువ స్కోర్ ఉన్న‌ప్ప‌టికీ 14 ఓవర్లకు 145 పరుగులతో ఆర్‌‌ఆర్ విజయానికి వేగంగా దూసుకెళ్లింది. ఆ త‌ర్వాత , ఆర్సీబీ బౌలర్లు పుంజుకుని శాంసన్, రియాన్ పరాగ్ (4; 4 బంతుల్లో), ధ్రువ్ జురెల్ (2; 3 బంతుల్లో) ఔట్ చేసి కాస్త పోటీలోకి వ‌చ్చిన బ‌ట్ల‌ర్ దూకుడుగా ఆడి మ్యాచ్ ఈజీ అయ్యేలా చేశాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ రెండు పాయింట్లు సాధించి 8 పాయింట్లతో నేరుగా అగ్రస్థానానికి ఎగబాకింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. కాబట్టి రాబోయే మ్యాచుల్లో గెలవకపోతే ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి కూడా చేర‌డం క‌ష్ట‌మే. ఇక ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 పరుగులు చేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 7500 పరుగులు పూర్తి చేసిన‌ తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Exit mobile version