Zimbabwe tour | జింబాబ్వేకు వెళ్లే భారత క్రికెట్ జట్టు ఇదే.. జట్టు నిండా యువ ఆటగాళ్లే..!
Zimbabwe tour | అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగుతున్న 'టీ20 వరల్డ్ కప్-2024' (T20 world cup-2024) తో ఇప్పుడు క్రికెట్ ప్రియులంతా మాంచి జోష్‌లో ఉన్నారు. ఆటగాళ్ల విన్యాసాలను చూస్తూ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఈ మెగాటోర్నీ తర్వాత జరగాల్సిన సిరీస్‌ల గురించి ప్లాన్ చేస్తోంది.
Zimbabwe tour : అమెరికా, వెస్టిండీస్‌లలో జరుగుతున్న ‘టీ20 వరల్డ్ కప్-2024’ (T20 world cup-2024) తో ఇప్పుడు క్రికెట్ ప్రియులంతా మాంచి జోష్‌లో ఉన్నారు. ఆటగాళ్ల విన్యాసాలను చూస్తూ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారత క్రికెట్ బోర్డు మాత్రం ఈ మెగాటోర్నీ తర్వాత జరగాల్సిన సిరీస్‌ల గురించి ప్లాన్ చేస్తోంది. ఒకవైపు కొత్త కోచ్ ఎంపిక గురించి కసరత్తులు చేస్తూనే మరోవైపు వచ్చే ఏడాది కాలంలో టీమిండియా ఆడాల్సిన మ్యాచ్‌ల నిర్వహణ, షెడ్యూల్స్ గురించి ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే హోమ్ సిరీస్‌ల షెడ్యూల్‌ను విడుదల చేసిన బీసీసీఐ తాజాగా జింబాబ్వేలో టీ20 సిరీస్గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చింది. జింబాబ్వే టూర్‌కు వెళ్లే భారత జట్టును సెలెక్టర్‌లు ప్రకటించారు. మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను వెల్లడించారు. జింబాబ్వే టూర్‌కు వెళ్లే టీమిండియాకు యంగ్ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. యువ ఓపెనర్ గిల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. యంగ్ ప్లేయర్లతో కూడిన జట్టును సమర్థంగా నడిపే బాధ్యతను అతడికి కట్టబెట్టారు.
జట్టులో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, జురెల్, నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే చోటు దక్కించుకున్నారు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతంగా ఆడిన అభిషేక్, నితీశ్‌కు టీమ్‌లో స్థానం దొరకడం హైలైట్ అనే చెప్పాలి.
ఇదీ జట్టు
శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్, ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram