• Telugu News
  • /Telangana

ఫోటో దిగిపోయారు..కొనుగోలు చేయడం లేదు: రైతుల మొర

అదిలాబాద్ మార్కెట్ యార్డులో కాంటపూజ చేసి అధికారులు ఫోటోలు దిగిపోయారని, కానీ ధాన్యం, మక్కలు కొనడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | May 27, 2026, 5:07 pm IST
Read Time: 3 mins
ఫోటో దిగిపోయారు..కొనుగోలు చేయడం లేదు: రైతుల మొర

అదిలాబాద్ మార్కెట్ యార్డులో అధికారులు కాంట పూజ చేసి..పంట కొనకుండా రైతులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని స్థానిక రైతులు వాపోయారు. కాంటా పూజ చేయడంతో ఇక తమ పంట కొనుగోలు చేస్తారన్న నమ్మకంతో కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చామని వారు తెలిపారు. అయితే అధికారులు మాత్రం కాంటపూజ ఫోటోలు దిగి వెళ్లిపోయారని, ధాన్యం, మక్కలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

కొనుగోలు కేంద్రంలో ధాన్యం, మక్కలు కొనుగోలు కోసం 15రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా ఇక్కడే ఉన్నామంటూ అధికారులకు తన ఆవేదన వినిపించారు. ఇప్పుడు అకాల వర్షంతో ధాన్యం కుప్పలు తడిసిపోయిందని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించి పంట కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

‘సర్‌’ ప్రక్రియకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
కేర‌ళం మాజీ సీఎం విజ‌య‌న్ నివాసంలో ఈడీ సోదాలు

Tags: