Site icon vidhaatha

మంథని బీఆర్‌ఎస్‌లోకి న్యాయవాద దంపతులు


విధాత ప్రతినిధి, పెద్దపల్లి: మంథనికి చెందిన ప్రముఖ న్యాయవాది పులి అశోక్‌ దంపతులతో పాటు పవర్‌హౌజ్‌ కాలనీకి చెందిన ఆకుల వేణు బీఆర్‌ఎస్‌ లో చేరారు. గురువారం మంథని పట్టణంలోని అపార్ట్‌మెంట్‌లో కాటం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ హాజరయ్యారు. పుట్ట దంపతులను కాటం నారాయణరెడ్డి దంపతులు శాలువాలు, పూలమాలతో ఘనంగా సన్మించారు.


ఈ సందర్బంగా న్యాయవాద దంపతులు పులి అశోక్‌, ఆకుల వేణులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. అనంతరం మంథని అభివృద్ధి పత్రాలు అందజేశారు. పట్టణ ప్రజలు గొప్పగా ఆలోచన చేయాలని, గతానికి ప్రస్తుతానికీ బేరీజు వేసుకోవాలని చెప్పారు. గత పాలకుల వైఫల్యాల మూలంగా వెనుబడిపోయామని, తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో మంథనిని అన్నివిధాలుగా తీర్చిదిద్దామని, బీఆరెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు.

Exit mobile version