baby bheem born| బాల భీముడు పుట్టాడు…!

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ గిరిజన మహిళ నాలుగున్న‌ర కిలోల‌ బాబుకు జ‌న్మనిచ్చింది. ఇందులో విశేషం ఏమిటంటే... శిశువు అంత బ‌రువు ఉన్నప్పటికి..వైద్యులు నార్మ‌ల్ డెలివ‌రీ చేశారు.

విధాత : మాకు బాల భీముడు జన్మించాడని తల్లిదండ్రులు…కుటుంబ సభ్యులు సంబర పడుతున్నారు. బాల భీముడి జననంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా శ్రమించిన వైద్యులు సైతం భలే పుట్టాడురా బాబు..అని హమ్మయ్య అనుకున్నారు. మంచి ఆరోగ్యంతో పుష్టికరంగా..భారీ ఖాయం..అధిక బరువుతో జన్మించిన శిశువును అంతా బాల భీముడిగా అభివర్ణిస్తుంటారు.

అలాగే భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ గిరిజన మహిళ నాలుగున్న‌ర కిలోల‌ బాబుకు జ‌న్మనిచ్చింది. ఇందులో విశేషం ఏమిటంటే… శిశువు అంత బ‌రువు ఉన్నప్పటికి..వైద్యులు నార్మ‌ల్ డెలివ‌రీ చేశారు. తల్లి బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నారని..బాల భీముడు భలే ఉన్నాడంటూ వైద్యులు, కుటుంబ సభ్యులు మురిసిపోతున్నారు. గతంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వేర్వేరు గ్రామాలకు చెందిన గర్భిణులు 5.2 కిలోలు, 4.9 కిలోలు, 4.7 కిలోల బాల భీముులకు జన్మనివ్వడం విశేషం.

Latest News